
జనసేనాని పవన్‌కల్యాణ్‌తో జాగ్రత్తగా వుండాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జరిగిన భేటీలో మాట్లాడుకున్న అంశాల్ని పవన్ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. పొత్తులపై తమ మధ్య ఏం జరిగిందో పవన్ అందరి సమక్షంలో చెప్పారు. రహస్యంగా ఉండాల్సిన అంశాల్ని, పవన్ తన అపరిపక్వతతో బయటకు చెప్పారని, ఇది సరైంది కాదని బీజేపీ భావిస్తోంది.
మరీ ముఖ్యంగా నడ్డాతో మాట్లాడిన అంశాల్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించినట్టు బీజేపీ అధిష్టానం అనుమానిస్తోంది. మిత్రపక్షమనే ఉద్దేశంతో జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తుపై నడ్డా వివరంగా చర్చించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు నిరాకరణకు కారణాలను పవన్‌తో నడ్డా చర్చించినట్టు బీజేపీ నేతలు వివరించారు. వైసీపీ ఓటు బ్యాంక్ ఎప్పటికీ బీజేపీ-జనసేన కూటమి వైపు రాదని, టీడీపీ రాజకీయంగా బలహీనపడితేనే తమకు మంచిదంటూ లెక్కలతో సహా పవన్‌కు నడ్డా వివరించినట్టు సమాచారం.
రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూటమి, అలాగే వైసీపీ, టీడీపీ వేర్వేరుగా పోటీ చేద్దామని, ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని పవన్‌తో నడ్డా చెప్పినట్టు తెలిసింది. జగన్ సర్కార్ వ్యతిరేక ఓటు చీలిపోతే తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని నడ్డాతో పవన్ అన్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ, టీడీపీలలో అధికారం ఎవరికనేది మనకు అనవసరమని నడ్డా తేల్చి చెప్పారని సమాచారం. అయితే నడ్డా మాటలకు పవన్ మౌనం వహించారని, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి ఢిల్లీలో ఏం జరిగిందో బాబుకు పూసగుచ్చినట్టు చెప్పారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు.
మిత్రుడని నమ్మి, ఓపెన్‌గా కొన్ని రాజకీయ అంశాలను పంచుకుంటే, వాటన్నింటిని మోసకెళ్లి చంద్రబాబుకు చేరవేయడంపై బీజేపీ అధిష్టానం గుర్రుగా వుంది. పవన్ వైఖరి అర్థం కావడంతో, చంద్రబాబుకు ఏవైతే తెలియాలో, అలాంటి వాటి గురించే పవన్‌తో చర్చించాలనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
బాబుకు బీజేపీ అంతరంగాన్ని తెలియజేసే పనిముట్టుగా పవన్ తయారయ్యారని జాతీయ పార్టీ భావన. దీంతో పవన్ విషయంలో అప్రమత్తంగా వుండాలని, అన్ని విషయాలు పంచుకోకూడదనే అభిప్రాయానికి బీజేపీ అధిష్టానం వచ్చిందనేది వాస్తవం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా