బాబు మోహ‌న్ ఎక్క‌డ‌?

ప్ర‌ముఖ న‌టుడు బాబుమోహ‌న్ ఎక్క‌డ‌? ‘మా’ ఎన్నిక‌ల నామినేష‌న్లు, ప్ర‌చారంలో యాక్టీవ్‌గా క‌నిపించిన బాబుమోహ‌న్‌, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయారు.  Advertisement ప్ర‌తిష్టాత్మ‌క ‘మా’ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యాన‌ల్ ఘ‌న…

ప్ర‌ముఖ న‌టుడు బాబుమోహ‌న్ ఎక్క‌డ‌? ‘మా’ ఎన్నిక‌ల నామినేష‌న్లు, ప్ర‌చారంలో యాక్టీవ్‌గా క‌నిపించిన బాబుమోహ‌న్‌, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయారు. 

ప్ర‌తిష్టాత్మ‌క ‘మా’ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఆ ప్యాన‌ల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన బాబు మోహ‌న్ మాత్రం ఓడిపోయారు. ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ నుంచి పోటీ చేసిన హీరో శ్రీ‌కాంత్ చేతిలో బాబు మోహ‌న్ ప‌రాజ‌యం పాల‌య్యారు.

మంచు విష్ణు ప్యాన‌ల్‌లో ముఖ్య పోస్టుల‌కు సంబంధించి అంద‌రూ గెలిచి తాను మాత్ర‌మే ఓడిపోవ‌డంపై ఆయ‌న మ‌న‌స్తాపం చెందిన‌ట్టు స‌మాచారం. భారీ క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డం వ‌ల్లే తాను ఓడిపోయాన‌ని వాపోతున్నార‌ని తెలిసింది. దీన్ని ఆయ‌న జీర్ణించుకోలేకున్నారు.

నిజానికి ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌ను డ్యామేజీ చేయ‌డంలో బాబుమోహ‌న్ చేసిన కామెంట్ కీల‌కంగా ప‌నిచేసింద‌నే అభిప్రాయాలున్నాయి. నామినేష‌న్ అనంత‌రం మంచు విష్ణు ప్యాన‌ల్ స‌భ్యులు మీడియాతో మాట్లాడే సంద‌ర్భంలో బాబుమోహ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

త‌మ‌ది తెలుగు ప్యాన‌ల్ అని, తెలుగు వాళ్ల ప్యాన‌ల్‌ను గెలిపించాల‌నేదే త‌మ నినాదామ‌ని ప్ర‌క‌టించారు. ఆ నినాద‌మై మంచు ప్యాన‌ల్ విధాన‌మై, ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ పాలిట ఓట‌మికి కార‌ణ‌మైంది. చివ‌రికి తానే ఓడిపోవ‌డం బాబుమోహ‌న్ మ‌న‌సును క‌ష్ట‌పెట్టిన‌ట్టుంది. 

అందువ‌ల్లే ఆయ‌న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు, వినిపించ‌డం లేదు. బాబుమోహ‌న్ అదృశ్యంపై టాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.