హాస్పిటల్‌లో బెడ్‌పై రాంగోపాల్ వర్మ. ఆయన తల వెనుక భాగంలో తాను ఆరాధించే అతిలోక సుందరి బొమ్మ….ఇప్పుడీ ఈ సీన్‌తో కూడిన చిత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పవర్‌స్టార్ అంటూ పవన్‌కల్యాణ్‌పై షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించిన వర్మను టార్గెట్ చేస్తూ పలువురు ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలనే కాన్సెఫ్ట్‌తో పలువురు వర్మపై తమదైన స్టైల్‌లో వెబ్ సిరీస్‌లను తీస్తున్నారు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూతన్‌నాయుడు వర్మను టార్గెట్ చేస్తూ పరాన్నజీవి అనే వెబ్‌సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో డేరాబాబా అనే సినిమా కూడా రానున్నట్టు సమాచారం. తాజాగా దర్శకుడు నీలకంఠం “ఎవడ్రా నన్ను కొట్టింది” అనే టైటిల్‌తో వర్మను టార్గెట్ చేస్తూ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా సినీ లవర్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే…తనను ఎవరు కొట్టారో తెలియక ఆరు నెలల పాటు వర్మ పడే సంఘర్ణణే సినిమాగా తెరకెక్కనుంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సినిమా షూటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఆస్పత్రిలో బెడ్‌పై పడుకున్న వర్మ కనిపిస్తాడు. ఆయన తల వెనుక వర్మ ఎంతగానో ఇష్టపడే అతిలోక సుందరి శ్రీదేవి ఫొటో ఉంటుంది. కాగా ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ వర్మను కొట్టిందెవరు? అంటూ ఎక్కువ మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.