హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి తన ప్రేమ వ్యవహారంపై స్పందించింది. గతంలో తను ఒకర్ని ప్రేమించానని, కానీ ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలవలేదని ఆమె వెల్లడించింది. ఆ బ్రేకప్ నుంచి తను చాలా నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చింది.
గతంలో తను చాలా ఎమోషనల్ గా ఉంటేదాన్నని, బ్రేకప్ వల్ల మానసికంగా చాలా కుంగిపోయానని తెలిపిన రాశీఖన్నా.. ఆ టైమ్ లో కుటుంబం, స్నేహితులు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకుంది.
ఇప్పటికీ ఇండస్ట్రీ నుంచి కాకుండా, ఇండస్ట్రీ వెలుపలే తనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని అంటున్న రాశీ ఖన్నా.. బ్రేకప్ తర్వాత మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యానని, కెరీర్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యానని తెలిపింది.
ఇంతకీ ఎవరా హీరో.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా మారింది రాశి ఖన్నా. అందులో నాగశౌర్య హీరో. ఆ తర్వాత సాయిదుర్గతేజ్ తో ఆమె సుప్రీమ్, ప్రతిరోజూ పండగే సినిమాలు చేసింది. అటు రామ్ తో కూడా హైపర్, శివమ్ సినిమాలు చేసింది.
వీళ్లతో పాటు గోపీచంద్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది. వీళ్లలో ఎవరు ఆమె ఎక్స్-లవర్ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది.
ఎవరు భారీ గిఫ్ట్ ఇచ్చాడో..వాడే ఆ ప్రేమికుడు!
Call boy jobs available 9989793850
vc available 9380537747
Sai dharm tej