కోలీవుడ్ అట్టుడికిపోయింది. స్టార్ హీరో అజిత్ హాస్పిటల్ లో చేరాడనే విషయం తెలిసి అందర్లో ఒకటే టెన్షన్. దాదాపు 4 గంటల పాటు కోలీవుడ్ లో, సోషల్ మీడియాలో ఇదే చర్చ. ఇంతకీ అజిత్ కు ఏమైంది?
అజిత్ హాస్పిటల్ లో చేరిన మాట వాస్తవమే. కానీ అంతా అనుమానించినట్టు అంత భయపడాల్సిన పనిలేదు. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే అజిత్, చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేరాడు. అయితే గతంలో ఎప్పుడూ అజిల్ ఇలా చెకప్ కోసం హాస్పిటల్ కు రాలేదు. మరి ఈసారి ఎందుకు?
దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.. ప్రస్తుతం ఈ హీరో, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి తాజాగా అజర్ బైజాన్ లో ఓ భారీ షెడ్యూల్ జరిగింది. అక్కడే ఓ విషాధం జరిగింది. త్రిష, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిలన్, ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.
అజర్ బైజాన్ షెడ్యూల్ లో ఆర్ట్ డైరక్టర్ కు హఠాత్తుగా ఛాతి నొప్పి వచ్చింది. హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే చనిపోయాడు. ఈ ఘటన అజిత్ న కలచివేసింది. అతడితో ఎన్నో సినిమాలకు వర్క్ చేశాడు అజిత్.
ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జార్జియాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూనిట్ లో అందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా అజిత్ కూడా టెస్టులు చేయించుకున్నాడు. దీని కోసమే అతడు హాస్పిటల్ కు వెళ్లాడు, హీరో పూర్తి ఫిట్ గా ఉన్నట్టు అజిత్ మేనేజర్ ప్రకటించాడు.