కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఇందులో ఇరవై నిమిషాల పాటు వుండే ఒక కీలక పాత్రని రామ్ చరణ్‌తో చేయిద్దామనుకున్నారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’కి వున్న క్లాజ్‌ల వల్ల చరణ్ ఈ చిత్రంలో నటించినా కానీ వచ్చే వేసవి వరకు విడుదల చేసుకునే వీల్లేదు. దాంతో ఆ పాత్రని మహేష్‌తో చేయించాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడు.
మహేష్‌తో కొరటాలకి వున్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే మహేష్ ఇంతవరకు ఇలాంటి అతిథి పాత్రలు చేయలేదు కనుక ఆలోచనలో పడ్డాడు. అందుకే ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలావుంటే చరణ్ ఈ పాత్ర చేయనప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేయించుకునే అవకాశం వున్నా కానీ చిరంజీవి, చరణ్ ఎందుకని ఆ ఆప్షన్ వాడుకోవడం లేదని మెగా ఫాన్స్ ఫీలవుతున్నారు.
చిరంజీవి, పవన్ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలనేది అభిమానుల ఆశ. ఈ చిత్రం వల్ల అది కాస్తయినా తీరడానికి ఛాన్స్ వున్నా ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. ఒకవేళ మహేష్‌తో ప్రయత్నాలు సఫలం కాకపోతే పవన్‌ని సంప్రదిస్తారేమో. రాజకీయాల కోసం రెండేళ్లు సినిమాలకి దూరమైన పవన్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా వున్నాడు. ఈ ఉత్సాహంలో అన్నయ్యతో కలిసి నటించే అవకాశాన్ని పవన్ వదులుకోకపోవచ్చు.