కొన్ని విషయాలు బయటకు రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ కచ్చితంగా అవి ఏదో ఒక రోజు బయటకొస్తాయి. ఇది కూడా అలాంటి మేటరే. షూటింగ్ లేకపోతే ముంబయి వెళ్లిపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. తల్లిదండ్రులు చెన్నైలోనే ఉంటారు, షూటింగ్స్ హైదరాబాద్ లో ఉంటాయి. ఈ రెండు నగరాల్ని కాదని, ఆమె ఎప్పటికప్పుడు ముంబయి ఎందుకు వెళ్తుందో చాలామందికి అర్థం కాలేదు.
ఎప్పుడైతే ఆమె తన నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టిందో, ముంబయి వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నట్టు ప్రకటించిందో, అప్పుడు ఆమెకున్న 'ముంబయి కనెక్షన్' అందరికీ తెలిసొచ్చింది.
నెలకు కనీసం 2 సార్లు వరలక్ష్మి శరత్ కుమార్ ముంబయి ఎందుకు వెళ్తుందో అందరికీ ఇప్పుడు తెలిసొచ్చింది. తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవ్ ను కలిసేందుకే ఆమె తరచుగా ముంబయికి వెళ్లిందనేది ఇప్పుడు బయటపడింది.
అదే టైమ్ లో నికొలాయ్ తో కలిసి ఆమె ఎప్పుడూ చెన్నైలో కనిపించలేదంటోంది కోలీవుడ్ మీడియా. అలా కనిపించినట్టయితే, వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడి ఉండేదని, అతడ్ని చెన్నైకి రప్పించకుండా, తనే తరచుగా ముంబయికి వెళ్లడం వల్ల మీడియాకు ఈ లవ్ మేటర్ బయటపడలేదని అంటున్నారు.
నికొలాయ్ తో కలిసి చాలా స్వేచ్ఛగా ముంబయి వీధుల్లో విహరించిందంట వరలక్ష్మి. ఇద్దరూ కలిసి ముంబయి చుట్టుపక్కల చాలా ప్రదేశాలు చుట్టొచ్చారంట. ముంబయి మీడియాకు తను అంతగా తెలియకపోవడం వరలక్ష్మికి కలిసొచ్చింది.