మౌనమే రాజమౌళి సమాధానమా?

తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు ఎవ్వరైనా వెంటనే స్పందిస్తారు. కొంతమంది లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. కానీ రాజమౌళి మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు ఎవ్వరైనా వెంటనే స్పందిస్తారు. కొంతమంది లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. కానీ రాజమౌళి మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

నిన్నటికినిన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. 34 ఏళ్లు తాము స్నేహితులుగా ఉన్నామని చెప్పుకున్న ఆయన.. ఈమధ్య తనను రాజమౌళి టార్చర్ పెడుతున్నాడని, నరకం చూపిస్తున్నాడని ఆరోపిస్తూనే, తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు.

ఆ వీడియో రిలీజై దాదాపు 24 గంటలు అవుతోంది. రాజమౌళి నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించలేదు. చూస్తుంటే, శ్రీనివాసరావు ఆరోపణల్ని రాజమౌళితో పాటు ఆయన కుటుంబం లైట్ తీసుకున్నట్టుంది.

నిజానికి కొన్ని వివాదాలపై స్పందించకుండా మౌనంగా ఉండడమే ఉత్తమ మార్గం. మరీ ముఖ్యంగా మీడియా ఎటెన్షన్ ఎక్కువగా ఉండే అంశాల్లో ఈ విధానం చక్కగా పనికొస్తుంది. బహుశా, రాజమౌళి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.

మరికొంతమంది మాత్రం ఈ విషయం ఇంకా జక్కన్న వరకు చేరి ఉండదంటున్నారు. ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే, ఈ సోషల్ మీడియా యుగంలో ఇంత వైరల్ అయిన ఈ టాపిక్ వాళ్లకు చేరకుండా ఉండదు. కచ్చితంగా ఈ వీడియోను రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా చూసే ఉంటారు. కాకపోతే ప్రస్తుతానికి మౌనంగా ఉండడమే బెటరని అంతా కలిసి ఓ నిర్ణయానికొచ్చి ఉంటారు.

నిజానికి రాజమౌళికి నిన్న ఒకటి కాదు, రెండు దెబ్బలు తగిలాయి. ఓవైపు ఈ వీడియో రిలీజై ఆయన్ను ఊహించని వివాదంలోకి లాగగా.. మరోవైపు మహేష్ బాబు లుక్ లీక్ అయింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది.

17 Replies to “మౌనమే రాజమౌళి సమాధానమా?”

  1. స్పందించనవసరం లెదు అంటూనె…. ఇండైరెక్ట్ గా ఈ విషయానికి ప్రచారం కల్పించాలి అన్నది వీడి ఉద్దెసం!

  2. వీడు ఒక పక్క సమాధానం అవసరం లెదు అంటూనె.. మరొ పక్క ఈ విషయానికి పుబ్లిసిటీ ఇస్తున్నాడు!

  3. వీళ్ళు మాట్లాడితే మీడియా ఆర్టికల్స్ రాసి సొమ్ము చేసుకోవచ్చని. శవం మీద చిల్లర ఏరుకునే బ్యాచ్

  4. మౌనం అంగీకారం ఆరోపణలు అంగీకరించి పెంట చేసుకోవడం ఎందుకు అని సైలెంట్ అయినట్లు వుంది

Comments are closed.