అప్పుడు ట్రోలింగ్.. ఇప్పుడు నో మేకప్ లుక్

2 రోజుల కిందట ఓ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా హాజరైంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఆ టైమ్ లో ఆమెపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దానికి కారణం ఆమె మేకప్ సరిగ్గా లేకపోవడమే. ఖరీదైన…

2 రోజుల కిందట ఓ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా హాజరైంది హీరోయిన్ సంయుక్త మీనన్. ఆ టైమ్ లో ఆమెపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దానికి కారణం ఆమె మేకప్ సరిగ్గా లేకపోవడమే. ఖరీదైన ఫోన్లు చేతిలో పట్టుకొని ఆమె ఫొటోలకు పోజులిస్తే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. సంయుక్త మీనన్ ముఖంలో ఫీచర్స్ కంటే, ఫోన్ లో ఫీచర్స్ కచ్చితంగా బాగుంటాయంటూ సెటైర్లు పడ్డాయి. 

ఇది జరిగి 2 రోజులవుతుంది. ఇప్పుడు దానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది సంయుక్త మీనన్. రీసెంట్ గా తన సోషల్ మీడియాలో 'నో మేకప్' ఫొటోను షేర్ చేసింది. దీనికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 'అందమనేది పైకి కనిపించేది కాదు, నిజమైన అందం అంతర్గతంగా మెరుస్తుంది' అనేది ఆ కొటేషన్. 

నో ఫిల్టర్ ఫొటోస్, నో మేకప్ పిక్స్ అనేది కొత్త ట్రెండ్ కాదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఈ విధంగా మేకప్ లేకుండా తమ ఫొటోలు రిలీజ్ చేశారు. అయితే సంయుక్త మీనన్ ఇప్పటివరకు అలాంటి పని చేయలేదు. ఇప్పుడు ఉన్నఫలంగా ఫొటో రిలీజ్ చేయడానికి, కొన్ని రోజుల కిందట జరిగిన ట్రోలింగే కారణం అంటున్నారు చాలామంది. 

ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ ఉంది. బింబిసార, సర్, విరూపాక్ష సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. డెవిల్ సినిమా ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఆమె కెరీర్ పై పెద్దగా పడలేదు. ప్రస్తుతం ఈమె నిఖిల్ సరసన స్వయంభూ సినిమాలో నటిస్తోంది.