నటీనటులంతా ఆస్తులు కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. తమకొచ్చిన డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులుగా పెడుతుంటారు. మరి ఆస్తులమ్ముకోవడం ఏంటి? కొంతమంది నటులకు అంత కష్టం ఏమొచ్చింది? చాలామందికి కలిగే అనుమానం ఇది.
అయితే పైకి ఇది ఆస్తుల అమ్మకంగా కనిపించినప్పటికీ, దాని వెనక కూడా పెట్టుబడి ఆలోచన విధానం ఉందనేది కాదనలేని వాస్తవం. ఉదాహరణకు సోనాక్షి సిన్హానే తీసుకుందాం. ముంబయిలో ఆమె ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ఇల్లు. పైగా అందులోనే తన ప్రియుడ్ని పెళ్లాడింది కూడా.
అలాంటి సెంటిమెంట్ ఇంటిని మరో ఆలోచనకు తావులేకుండా అమ్మేసింది సోనాక్షి. దీనికి కారణం, ఆమె పెట్టుబడి వ్యూహమే. అలా వచ్చిన డబ్బుతో దుబాయ్ లో ప్రాపర్టీ కొనేందుకు ప్లాన్ చేస్తోందట ఈ ముద్దుగుమ్మ.
ఇక రీసెంట్ గా అమితాబ్ కూడా ముంబయిలో కొన్ని ఆస్తులు అమ్మేశారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బును గుర్గావ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో పెట్టుబడిగా పెట్టబోతున్నారు బిగ్ బి. ప్రస్తుతం అక్కడ బూమ్ విపరీతంగా ఉంది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ను తలపించే విధంగా అది మారుతోంది.
ఈమధ్య అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా కూడా తమ ఆస్తులు అమ్మేసుకున్నారు. వీళ్లది కూడా సేమ్ రూటు. ముంబయిలోనే మరో ఖరీదైన ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్స్ కొనుకోలు చేసేందుకు అక్షయ్ కుమార్ తన పాత ఆస్తుల్ని అమ్ముకోగా.. లాస్ ఎంజెలెస్ లో పెట్టుబడుల కోసం ప్రియాంక చోప్రా, ముంబయిలో ఆస్తుల్ని విక్రయించింది.
ఇలా నటీనటులు తమ ఆస్తులు విక్రయించడం వెనక పెట్టుబడి వ్యూహమే తప్ప, ఆర్థిక కష్టాలుండవు. చాలామంది ఇలా కొత్తకొత్త కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతుంటే సల్మాన్, షారూక్ మాత్రం సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నారు. షారూక్ తన ‘మన్నత్’ ను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టగా, సల్మాన్ ‘గెలాక్సీ’ని వీడనంటున్నాడు.
Meekanashi Khan sinha – turaka munja ki dubai ne correct
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Y sir