గ‌ఫూర్.. ఈ విన్యాసాలు దేనికోసం కామ్రేడ్‌!

సీపీఎం నాయ‌కుడిగా గ‌ఫూర్ టీడీపీ అనుకూల చానెల్‌లో కూచుని అవాకులు చెవాకులు పేల‌డంపై ఆ పార్టీ నాయ‌క‌త్వం మౌనంగా వుండ‌డం కూడా మంచిది కాదు.

సీపీఎం నాయ‌క‌త్వ ఎజెండాకు విరుద్ధంగా, సొంత ఎజెండాతో ఆ పార్టీ పేరుతో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గ‌ఫూర్ స‌ర్క‌స్ ఫీట్లు చేస్తున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఇటీవ‌ల ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే సీపీఎం ధోర‌ణుల‌పై తీవ్ర‌స్థాయిలో అభియోగాలు మోపారు. ఆ రాత‌ల‌పై సీపీఎం తీవ్రంగా స్పందించింది.

గ‌త ఆదివారం ఆంధ్ర‌జ్యోతి ఎడిట్ పేజీలో ఆ ప‌త్రిక ఎండీ ఆర్కే సీపీఎంకు వ్య‌తిరేకంగా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్‌తో చేతులు క‌ల‌ప‌డం వ‌ల్లే సీపీఎం విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయింద‌ని ఆర్కే రాశారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ ఎన్ని అరాచ‌కాలు జ‌రిగినా సీపీఎం ప‌ద‌వి విప్ప‌లేద‌ని ఆ వ్యాసంలో విమ‌ర్శించారు. త‌న‌పై ఆర్కే విమ‌ర్శ‌ల‌కు సీపీఎం అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చింది. ఆ కౌంట‌ర్‌లో మ‌చ్చుకు కొన్ని వాక్యాలు.

‘గత మూడు మాసాల్లో సీపీఎంపై ఇలా దుర్మార్గంగా దాడి చేయడం, నిరాధార ఆరోపణలు చేసి ఆంధ్రజ్యోతి పాఠకుల్ని నమ్మించాలని ప్రయత్నించడం వెనుక మతలబు ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ‘కామ్రేడ్స్‌ కష్టాలు’ పేరుతో రాసిన ఈ దాడికి ‘కామ్రేడ్స్‌తో కష్టాలు’ అని పేరు పెట్టివుంటే బాగుండేది. తెలుగుదేశం తొమ్మిది నెలల పాలనా వైఫల్యం ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తగ్గించాలంటే ప్రజల తరపున గట్టిగా నిలబడి పోరాడుతున్న సీపీఎం ”విశ్వసనీయత”ను దెబ్బతీయకుండా సాధ్యం కాదని రాధాకృష్ణ (ఆర్‌కె) గ్రహించారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఉన్నవీ లేనివీ కల్పించి సీపీఎంపై ఆరోపణలు చేసి దాని విశ్వసనీయతపై దెబ్బకొడితే ప్రజా ఉద్యమాలను అరికట్టవచ్చని, అసంతృప్తిని అదుపు చేయొచ్చని ఆయన భావిస్తున్నారు. రానున్న రోజుల్లో సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతమవుతాయని వారి కన్నా ముందే ఈయన పసిగట్టినట్లున్నారు. అందుకే ఈ ముందస్తు దాడి’ అని సీపీఎం ప‌దునైన ప‌దాల‌తో చుర‌క‌లు అంటించింది.

ఆర్కే విష‌యంలో సీపీఎం వైఖ‌రి ఏంటో, ఆ పార్టీ కౌంట‌ర్ వ్యాసాన్ని చ‌దివితే అర్థ‌మ‌వుతుంది. ఆర్కే తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వివిధ మాధ్య‌మాల వేదిక‌గా తీవ్రంగా వ్య‌తిరేకించాయి. కానీ అదే పార్టీకి చెందిన కార్మిక నాయ‌కుడు గ‌ఫూర్ మాత్రం, ఆర్కే యాజ‌మాన్యంలో న‌డిచే ఏబీఎన్ చానెల్ డిబేట్స్‌లో పాల్గొంటూ, వాళ్ల ఎజెండాకు అనుగుణంగా మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. సీపీఎం ఫిలాస‌ఫీకి పూర్తి విరుద్ధ వైఖ‌రితో కామ్రేడ్ ముసుగులో గ‌ఫూర్ మాట్లాడుతున్న తీరు, సీపీఎం శ్రేణుల‌కే ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

క‌ర్నూలు కేంద్రంగా కార్మికుల కోసం సీఐటీయూ నాయ‌కుడిగా ఉద్య‌మాల్లో పాల్గొని, ఆ త‌ర్వాత సీపీఎం నాయ‌కుడ‌య్యారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నియంతృత్వ పాల‌న‌, అణ‌చివేత‌ల గురించి ఆర్కే చానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో గ‌ఫూర్ పాల్గొన్న స‌మ‌యానికి…. రాష్ట్ర సీపీఎం అనుబంధ ఆశావ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు పెద్ద ఎత్తున చ‌లో విజ‌య‌వాడ పిలుపుతో అక్క‌డికి బ‌య‌ల్దేరారు. ఎక్క‌డిక‌క్క‌డ మ‌హిళ‌ల‌ను గృహ నిర్బంధాలు, పోలీస్‌స్టేష‌న్ల‌లో పెట్ట‌డంతో వాళ్లంతా ఆగ్ర‌హించారు. అయితే కూట‌మి స‌ర్కార్ నిర్బంధాల మ‌ధ్యే విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ఆందోళ‌న‌లు నిర్వ‌హించి, ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక పంపారు.

నిజానికి కూట‌మి స‌ర్కార్ చేప‌ట్టిన అణ‌చివేత చ‌ర్య‌ల గురించి ఖండించాల్సిన గ‌ఫూర్ ఆ ప‌ని చేయ‌కుండా, ఇంకా జ‌గ‌న్ ప్ర‌భుత్వ దాష్టీకాల గురించి విమ‌ర్శ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌త కొ్ంత‌కాలంగా గ‌ఫూర్ తీరు గ‌మ‌నిస్తుంటే, సీపీఎం నుంచి త‌న‌కు తాను బ‌య‌టికి వెళ్ల‌కుండా, నాయ‌క‌త్వ‌మే బ‌య‌టికి పంపాల‌ని కోరుకున్న‌ట్టుగా వుంది. అందుకే సీపీఎం నాయ‌క‌త్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌, ఆ పార్టీ శ్రేణులు ర‌గిలిపోతున్న చానెల్ డిబేట్ల‌లో కూచుని, నిస్సిగ్గుగా గ‌ఫూర్ మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

సీపీఎం నాయ‌కుడిగా గ‌ఫూర్ టీడీపీ అనుకూల చానెల్‌లో కూచుని అవాకులు చెవాకులు పేల‌డంపై ఆ పార్టీ నాయ‌క‌త్వం మౌనంగా వుండ‌డం కూడా మంచిది కాదు. సీపీఎం నుంచి బ‌య‌టికి తోస్తే, ప‌చ్చ చొక్కా వేసుకోడానికి త‌హ‌త‌హ‌లాడుతున్న గ‌ఫూర్ అంత‌రంగాన్ని గుర్తించి, ఇప్ప‌టికైనా ఆయ‌న‌పై నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. లేదంటే, సీపీఎం ముసుగులో ఆ పార్టీకి మ‌రింత న‌ష్టం తీసుకురావ‌డం ఖాయం. ఆర్కే ఎవ‌రి ప‌క్ష‌మో అంద‌రికీ తెలుసు. ఆర్కే ఏదో రాశార‌ని ర‌గిలిపోయిన సీపీఎం, త‌మ పార్టీలోనూ వుంటూ, పార్టీ ల‌క్ష్యాల‌కు విరుద్ధంగా ప‌ని చేసే నాయ‌కుల‌తో ఎక్కువ ప్ర‌మాదం అని ప్ర‌త్యేకంగా కామ్రేడ్స్‌కు చెప్పాల్సిన ప‌నిలేదు.

6 Replies to “గ‌ఫూర్.. ఈ విన్యాసాలు దేనికోసం కామ్రేడ్‌!”

  1. నినటివరకూ నువ్వు కూడా తొక పార్టిలు అని గెలి చెశావుగా! పైగా జగన్ కొసం ఆ పార్టిలకి కులం రంగు కూడా అంటించి GA లొ తెగ రాసావుగా! మరి ఇవ్వళ ఎందుకయ్యా నీకు ఆ పార్టి మీద అంత సానుబూతి???

    .

    అక్కడి దాకా ఎందుకు? నువ్వె రాసావు కదా ఎన్నికలలొ Y.-.C-.P కమ్యునిస్ట్ సంఘల అబ్యర్దులకి సప్పొర్ట్ చెస్తుంది అని!

    గుంటూరు క్రిష్నా జిల్లలలొ రెండు సార్లు గెలిచిన లక్ష్మన రావె ఈసారి Y.-.C.-.P మద్దతు ఇస్తుంది కాబట్తి, ఆలపాటి మీద గెలవబొతున్నారు అని రాసావ్!

    .

    తీరా చూస్తె అయన గొరంగా ఒడిపొయాడు! దానికి కారణం నువ్వు మద్దతు ఇవ్వటంతొ రాజకీయ రంగులు పులుముకుంది. వ్యక్తిగతంగా లక్ష్మన రావు గారికి పెరూన్నా నీ దెబ్బతొ గొరంగా ఓడిపూయారు! అదె విషయం RK చెప్పారు!

    1. ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు

      ఆలపాటి విజయానికి ధూళిపాళ్ల గండం!

      ఆల‌పాటికి వ్య‌తిరేకంగా కాపుల తీర్మానం!

      ఆలపాటి ఓడితే నాదెండ్ల పుణ్యమే!

      .

      ఇవి నువ్వు మొరిగిన ఆర్టికల్స్. నువ్వు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ది ఆలపాటి రాజెంద్ర ప్రసాద్ ఒడిపొతున్నాడు అన్నట్టు రాసి తెగ సంబరపడ్డ ఆర్టికల్స్! ఒకసారి వెళ్ళి ఎమి మొరిగావొ చూసుకొ!

  2. మన సోము వీర్రాజు,జీవిఎల్ నరసింహ రావు, విష్ణువర్ధన్ రెడ్డి లా టివి ఛానల్ లో డిబేట్ చేయాలంటారు..

  3. Anna simham…thoka lu akkaraledu….monna

    Anna support cpm ke….. ninna

    Cpm support lekapothe anna ki dikkuledu… ivala

    Annani andaru ontarini chesaru….repu..

Comments are closed.