బాబు గారూ… దీన్ని క‌క్ష‌పూరితం అన‌రా?

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోసానిని జైలు నుంచి బ‌య‌టికి వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాన్ని ఏమంటార‌ని వైసీపీ శ్రేణులు నిల‌దీస్తున్నారు.

త‌న జీవితంలో క‌క్ష పూరిత రాజకీయాలు చేయ‌లేద‌ని, భ‌విష్య‌త్‌లో కూడా చేయ‌న‌ని అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు అన్న నేప‌థ్యంలో….మ‌రి దీన్ని ఏమంటార‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళికి అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దీంతో ఇవాళ విడుద‌ల అవుతార‌ని అంతా అనుకున్నారు. మ‌రోవైపు ఏదో ర‌కంగా పోసానిని బ‌య‌టికి రాకుండా ప్ర‌భుత్వం క‌క్ష‌పూరిత రాజ‌కీయానికి తెర‌లేపుతుందేమో అనే అనుమానం కూడా వ్య‌క్త‌మైంది.

ఆ అనుమానం. భ‌య‌మే నిజ‌మైంది. కర్నూలు జిల్లా జైలు నుంచి పోసాని విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. సీఐడీ పోలీసులు పోసానికి సంబంధించి పీటీ వారెంట్ వేశారు. దీంతో క‌ర్నూలు జిల్లా జైలుకు సీఐడీ పోలీసులు వెళ్లారు. పోసానిని కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. క‌ర్నూలు జిల్లా జైలు నుంచే ఆన్‌లైన్‌లో జ‌డ్జి ఎదుట సీఐడీ పోలీసులు హాజ‌రుప‌రుస్తారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోసానిని జైలు నుంచి బ‌య‌టికి వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాన్ని ఏమంటార‌ని వైసీపీ శ్రేణులు నిల‌దీస్తున్నారు. రెడ్‌బుక్ పాల‌న‌లో భాగంగానే పోసానిని బ‌య‌టికి రాకుండా చేయ‌డం నిజం కాదా? అని జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంకెంత కాలం పోసానిని బ‌య‌టికి రాకుండా అడ్డుకుంటార‌ని నిల‌దీస్తున్నారు. ఒక‌వైపు రాజ‌కీయాల గురించి ఆద‌ర్శాలు వ‌ల్లిస్తూ, మ‌రోవైపు క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

ఇది స‌రైన విధానం కాద‌ని, మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించిన వ్య‌క్తిని ఇలా చేయ‌డం మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

19 Replies to “బాబు గారూ… దీన్ని క‌క్ష‌పూరితం అన‌రా?”

  1. మార్పు అనే లక్షణం వుండే మనుషులయితే అసలు అలా మాట్లాడి వుండే వారు కాదు..అసలు జగన్ లాంటోడికి attract అయ్యే వాడు ఎవడైనా తేడా గాళ్లే.

  2. అంటే హత్య చేసి నెరప్రవృత్తి నుండి తప్పుకుంటే శిక్ష ఉండకూడదు అంటావా?

  3. ఇది మరీ విచిత్రంగా ఉంది. PT వార్రెంట్ ఉంటె పొలెసులు తీసుకెల్లక, రంబా ఉర్వసులు వచ్చి తీసుకెల్తారా?

  4. తప్పు చెయ్యని అమాయుడిని శిక్షిస్తే కక్ష సాధింపు…. తప్పు చేసిన వాడిని చట్టం లో లొసుగులు అడ్డం పెట్టుకుని శిక్ష తప్పించుకోవడానికి ప్రయత్నించే వాడికి అడ్డు పడడం కక్ష ఎలా అవుతుంది

  5. ఇవ్వి షాక్ ఇవ్వడాలు .. చెడుగుడు ఆడుకోడలు అని లైట్ తీసుకో వెంకట్రావు .. అయినా తిడుతున్నపుడు అలాగే రాసేవాడివి కదా ..

Comments are closed.