అప్పుడే అంత తొందరేమొచ్చింది తేజూ..!

సాయిధరమ్ తేజ్ ఇంకా కోలుకోవాలి. మాటలో, డైలాగ్ డెలివరీలో స్పష్టత రావాలి. మరీ ముఖ్యంగా ఫిజిక్ షేప్ లోకి రావాలి. వ్యాయామం చేసేంత స్టామినా సంపాదించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా శరీర కదలికల్లో మరింత ఫ్లెక్సిబిలిటీ…

సాయిధరమ్ తేజ్ ఇంకా కోలుకోవాలి. మాటలో, డైలాగ్ డెలివరీలో స్పష్టత రావాలి. మరీ ముఖ్యంగా ఫిజిక్ షేప్ లోకి రావాలి. వ్యాయామం చేసేంత స్టామినా సంపాదించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా శరీర కదలికల్లో మరింత ఫ్లెక్సిబిలిటీ కావాలి.

ఇవన్నీ మేం చెబుతున్నవి కావు. బ్రో సినిమా ప్రమోషన్ టైమ్ లో స్వయంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించిన విషయాలివి. ఇవే విషయాల్ని ఇప్పుడు నెటిజన్లు మరోసారి ప్రస్తావిస్తున్నారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని, మానసికంగా-శారీరకంగా పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావాలని సూచిస్తున్నారు.

నిజానికి సాయిధరమ్ తేజ్ కూడా ఇదే మాట చెప్పాడు. కొన్నాళ్లు తను చిన్న విరామం తీసుకోవాలని, తనకు చాలా అవసరమని అన్నాడు. కానీ అంతలోనే సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమాను ప్రారంభించాడు. అందుకే గతంలో సాయితేజ్ చెప్పిన మాటల్నే, ఇప్పుడు నెటిజన్లు మరోసారి గుర్తు చేస్తున్నారు.

బ్రో సినిమాలో సాయితేజ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఫ్రీగా చెప్పలేకపోయాడు. అతడి బాడీ మూమెంట్స్ లో కూడా ఇబ్బంది కనిపించింది. ఈ విషయాల్ని ఆల్రెడీ అంగీకరించిన ఈ మెగా హీరో, వాటిని అధిగమించడం కోసం గ్యాప్ తీసుకుంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

స్ట్రాంగ్ కాంపౌండ్ కాబట్టి ఆటోమేటిగ్గా అవకాశాలొస్తాయి, అలాంటప్పుడు మరింత మెరుగ్గా తయారవ్వడానికి గ్యాప్ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.