వాదనలు ముగిశాయి, తీర్పు రిజర్వ్ లో ఉంచారు, రేపే హియరింగ్. ఏం జరగబోతోంది? కన్నడ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు బెయిల్ వస్తుందా? లేక అతడు మరికొన్ని రోజులు జైళ్లోనే ఉండాల్సి వస్తుందా?
నిజానికి గత వారమే వాదనలు ముగియడంతో అతడికి బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. దర్శన్ అభిమానులైతే బాణసంచాతో రెడీ అయిపోయారు కూడా. కానీ జడ్జి తీర్పును రిజర్వ్ లో ఉంచారు. రేపు దర్శన్ బెయిల్ పిటిషన్ పై ఫైనల్ హియరింగ్.
ఈ గ్యాప్ లో ఏ1 నిందితురాలు పవిత్ర గౌడ బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు ముగిశాయి. ఆమె బెయిల్ పై కూడా రేపే తుది తీర్పు రానుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇద్దరికీ బెయిల్ వస్తుందా లేక ఒక్కరికే వస్తుందా లేక ఇద్దరూ ఇంకొన్ని రోజులు జైళ్లోనే ఉండాలా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్న దర్శన్, బెయిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకవేళ కోర్టు బెయిల్ నిరాకరిస్తే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దర్శన్ తరపు న్యాయవాది ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు బెయిల్ రాకపోతే, తనను బళ్లారి జైలు నుంచి తిరిగి బెంగళూరు జైలుకు తరలించాలని కోరుతూ దర్శన్, మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. బెంగళూరు జైలులో సౌకర్యాలు బాగున్నాయని, అక్కడ వెన్నునొప్పికి చికిత్స తీసుకుంటానని దర్శన్ కోరే ఛాన్స్ ఉంది.
2 నెలలుగా జైళ్లో ఉన్న దర్శన్.. దసరా పండగను జైళ్లోనే జరుపుకున్నాడు. ప్రతి దసరాను కుటుంబంతో కలిసి గ్రాండ్ గా నిర్వహిస్తాడు దర్శన్. ఫ్యాన్స్ ను కూడా కలుస్తాడు. ఈసారి అతడికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది.
గోటితో పొయ్యే దానిని గొడ్డలి దాక తెచ్చుకున్నాడు.
గొడ్డలి వాడినందుకే సీఎం పదవి వచ్చిందనే చరిత్ర ని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు..
Call boy jobs available 9989793850
vc available 9380537747