ఈ వాదనలు ఎంత వరకు సబబు?

సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు Advertisement 1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంజాయ్ చేయచ్చు. మా గ్రాస్ కలెక్షన్లు కావాలంటే చెబుతాము…షేర్ చెప్పము.. అది మీకెందుకు? సోషల్…

సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు

1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంజాయ్ చేయచ్చు.

మా గ్రాస్ కలెక్షన్లు కావాలంటే చెబుతాము…షేర్ చెప్పము.. అది మీకెందుకు?

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ తో సమస్య ఏముంది.. ఫేస్ టు ఫేస్ జ‌రగడం లేదు కదా.

ఇలాంటి వాదనలు వినిపించారు నిర్మాత, పంపిణీదారు సూర్యదేవర నాగవంశీ. గ్రేట్ అంధ్ర కు ఇచ్చిన ఇంటర్వూలో.

ఈ కామెంట్ల మీద వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

షేర్ బయటకు చెప్పలేనపుడు గ్రాస్ మాత్రం ఎందుకు చెప్పాలి? ఫ్యాన్స్ వార్ లు పెంచడానికా? మా సినిమాల లెక్కలు మీకు ఎందుకు అన్నపుడు అసలు కొన్ని లెక్కలు మాత్రం చెప్పమని ఎవరు అడిగారు. పీఅర్ టీమ్ ల చేత వదిలించడం ఎందుకు?

1500 పెడితే నలుగురు సినిమా చూడొచ్చు. అంత కన్నా చీప్ ఎంటర్ టైన్ మెంట్ లేదు అన్నారు. ఏడాదికి పది సినిమాలు చూసినా 15 వేలు అవుతుంది. కానీ పట్టుమని అయిదు వేలు పెడితే అన్ని ఓటిటిల చందాలు కట్టేయచ్చు. అది సినిమా కన్నా చీప్ ఎంటర్ టైన్ మెంట్ అవుతుంది. ఇక్కడ పది సినిమాలే చూడాలి. అక్కడ వందల సినిమాలు చూడొచ్చు. ఈ లాజిక్ మిస్ అయితే ఎలా? అదీ కాక ప్రతి నెలకు ఒకటి వంతున 12 సినిమాలు చూస్తే చాలా… మరి మిగిలిన 140 సినిమాలు చూడక్కరలేదా?

ఫిజికల్ గా ఫ్యాన్స్ వార్ లు జ‌రగకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో అవేశాలు ఒక్కోసారి థియేటర్ల దగ్గర యుద్దాలుగా మారిన వైనం మరిచిపోతే ఎలా? ఇవే ఫ్యాన్ వార్స్ సినిమాలు సక్సెస్ ను కూడా ప్రభావితం చేస్తున్న సంగతి మరిచిపోతే ఎలా?

14 Replies to “ఈ వాదనలు ఎంత వరకు సబబు?”

  1. ఆయన వాదన ఆయన చెప్పాడు.. మనం అంగీకరించవచ్చు , లేకపోవచ్చు..

    సమంజసమా , కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే ..

  2. ఐదు వేలు కడితే అన్ని oTT లు అని రాసారు, వైఫై డబ్బులు కూడా లెక్క వెయ్యాలి కదా!

  3. ఒరేయ్ గ్రేటు…. ఇంటర్వ్యూ లో నవ్వుతూనే మాట్లాడవు కదరా…. ఆయన బాగానే మాట్లాడడు… నువ్వే రా ఎర్రి హూక ఫ్యాన్ వార్ పెట్టేది… ఈ చెత్త గాడు మెగా సినిమాలు మీద ఈగ వాలినివ్వడు… ఇప్పుడు దేవర సినిమా ఎక్కువ కలెక్ట్ చేసే సరికి కడుపు మంట తో రాస్తున్నాడు… సినిమా ని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసినంత గా ఒటి టి లో చూసి ఎంజాయ్ చేయలేము రా హౌలే…..

Comments are closed.