లాటరీ ద్వారా కేటాయించడమే పెద్ద మాయ!

అయిదేళ్లు పాటు లేని దరిద్రమైన వాతావరణాన్ని ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రజలు రుచిచూడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దరఖాస్తు చేసుకున్న ప్రెవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నారు. ఈ లాటరీని…

అయిదేళ్లు పాటు లేని దరిద్రమైన వాతావరణాన్ని ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రజలు రుచిచూడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దరఖాస్తు చేసుకున్న ప్రెవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నారు. ఈ లాటరీని సోమవారం నిర్వహిస్తారు. మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించడమే పెద్ద మాయ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లాటరీ నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి చాలా పెద్దమొత్తంలో లాభం వచ్చి ఉండేదని, ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ.. కేవలం తమకు అనుకూలురైన వారికి దోచిపెట్టడానికి మాత్రమే, వారి ద్వారా తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేలు దోచుకోవడానికి మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా కేటాయించబోతున్నట్టుగా పలువురు అనుమానిస్తున్నారు.

సాధారణంగా మద్యం దుకాణాల కోసం లాటరీ ద్వారా ఇచ్చినా, వేలం ద్వారా ఇచ్చినా సరే.. విక్రేతలు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేస్తుంటారు. చంద్రబాబునాయుడు ఏదో నీతులు ప్రవచిస్తున్నట్టుగా.. సిండికేట్లు కాకుండా చూడండని కలెక్టర్లను ఆదేశించడం, మద్యం దరఖాస్తుల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించడం వంటి డ్రామాలు నడిపించారు.

కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోట కూడా ఎన్డీయే కూటమిపార్టీల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే దరఖాస్తులు పడ్డాయి. వాళ్లే స్వయంగా రింగ్ చేయించారు. కాబట్టే చాలాచోట్ల ఒకటి, రెండు, మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కొన్ని చోట్ల లెక్కకు మిక్కిలిగా దరఖాస్తులు వచ్చాయి గానీ.. అలాంటి చోట లాటరీలో ఎవరికి వచ్చినా సరే.. వ్యాపారం మరియు వాటాలు తాము చెప్పినట్టుగా చేయాల్సిందేనని ఎమ్మెల్యేలు ముందుగానే హెచ్చరించినట్టు పుకార్లున్నాయి.

చంద్రబాబు సిండికేట్ కాకుండా దరఖాస్తులు వేయించడం వెనుక ఆయన చూసిన ఆదాయ మార్గం- దరఖాస్తుతో పాటు వచ్చే నాన్ రిఫండబుల్ డిపాజిట్ మాత్రమే. ఈ మొత్తం దరఖాస్తుల ప్రక్రియలో 1300 కోట్ల దాకా ఆదాయం వచ్చినట్టుగా చెబుతున్నారు. పచ్చమీడియా మొత్తం బాకా ఊదుతోంది. నిర్ణీత ఫీజులను కనీస ఫీజుగా నిర్ణయించి.. వేలం పాట నిర్వహించి ఉంటే గనుక… ఇంకా వేలకు వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. కానీ.. అందులో ఒక ప్రమాదం ఉంది.

ఇప్పుడంటే ఎమ్మెల్యేలు స్వయంగా రింగ్ చేయించి తమ అనుచరులకు ఇప్పిస్తున్నారు. వారి ద్వారా ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటారు. అదే వేలం పాట ద్వారా విక్రేత దక్కించుకుంటే.. ఇన్ని కోట్లు పోసి కాంట్రాక్టు తీసుకున్నాను.. నీకు వాటా ఇవ్వను అని ఎమ్మెల్యేకు ఎదురుతిరిగే అవకాశం ఎక్కువ. అందువల్ల ఆ పద్ధతికి వెళ్లనేలేదు. కేవలం తమ పార్టీ వారికి దోచిపెట్టడానికే మద్యం షాపులను ప్రెవేటీకరించడం అలాగే లాటరీ ద్వారా కేటాయించడం జరుగుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

76 Replies to “లాటరీ ద్వారా కేటాయించడమే పెద్ద మాయ!”

  1. కాష్ ట్రాన్సక్షన్స్ మాత్రమే అని బోర్డులు పెట్టుకోవడం లేదు కదా..

    ఇక మూసుకుని కూర్చో..

    మధ్య నిషేధం అని మేనిఫెస్టో లో పెట్టి.. 99% మేనిఫెస్టో అమలు చేసేశాం అని డప్పు కొట్టుకుని.. మద్యం అమ్మకాల మీద డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఎత్తేసి.. ఓన్లీ కాష్ అని కండిషన్ పెట్టి..లెక్కా పక్కా లేకుండా అడ్డం గా దోచుకున్నారు..

    ఇక మూసుకుని కూర్చో..

    1. before 2019 all cash transactions only . so all before gov robed from liquor shops . I think you don’t know how liquor sales happen through public shops or private shops .

      even after enabling cash transactions lets see ow how much business will do in Digital and how much in cash .

      1. 2019 కి ముందు లిక్కర్ షాపుల్లో కాష్ ట్రాన్సక్షన్ ఒక ఆప్షన్ మాత్రమే.. డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఆప్షన్ కూడా ఉండేది..

        ఎందుకంటే.. అప్పుడు డిజిటల్ అంతగా ప్రచారంలోకి పొందలేదు.. UPI అంతగా ఇంకా ప్రాచుర్యంలోకి రాని రోజులవి..

        మరి.. కాష్ ట్రాన్సక్షన్స్ లో అవినీతి జరిగినదని జగన్ రెడ్డి కి అనుమానం ఉండి ఉంటె.. ఎందుకు విచారణ చేయించలేదు..?

        మీ చేతగానితనాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దకండి..

        ఇందుకేగా మీ మొఖాన 11 సీట్లు ముష్టి కొట్టారు..

        జగన్ రెడ్డి హయం లో క్యాష్ మాత్రమే అని బోర్డులు పెట్టుకున్న షాపులు కూడా ఉండేవి..

        అన్ని లెక్కలు తీస్తారు.. నీ జగన్ రెడ్డి ని బొక్కలోకి తోస్తారు… నీ జగన్ రెడ్డి పార్టీ ని మూసేస్తారు.. వెయిట్ అండ్ వాచ్..

  2. Consumer aath kooda care cheyadu. Quality maintain ayyinda leda. That is what matters to the average person. Consumer is happy. That is important and Kootami is doing a good job.

  3. Consumer is happy. Kootami is doing a good job. Who cares who is managing that shop. Is the quality maintained and is the product available for a resonable price. And Kootami is definitely doing a super job at that.

  4. Consumer is happy. Kootami is doing a good job. Who cares who is managing that shop. Is the quality maintained and is the product available for a reasonable price. And Kootami is definitely doing a super job at that.

  5. Kootami is doing a good job. Who cares who is managing that shop. Is the quality maintained and is the product available for a reasonable price. And Kootami is definitely doing a super job at that.

  6. Who cares who is managing that shop. Is the quality maintained and is the product available for a reasonable price. And Kootami is definitely doing a super job there.

  7. Who cares who is managing that shop. Is the quality maintained and is the product available for a reasonable price. Present government is definitely doing a super job there.

          1. Really!! So, during Kootami rule Jagan binamis are still having their say and they formed syndicated and looted state revenue. Don’t say this anywhere, they will slap with their chappals.

          2. I am only spreading good words from JC and ABN has said about the looting in name of liquor syndicates and commissions and if you need evidences for their statements, please feel.free to reach them.

  8. ప్యాలెస్ పులకేశి గాడు అప్పట్లో తన బినామీ కంపనీ లతో హార్డ్ కాష్ రూపం లో దోచుకుని ప్యాలస్ సెల్లార్ లో బస్తాల కొద్ది డబ్బు దాచుకున్న సంగతి కూడా రాయి.

    ఆ ప్యాలస్ నీ బుల్డోజర్ పెట్టీ కుళ్లగించి అందులో దొరికిన డబ్బు నీ పేద ప్రజలకి పంచి పెట్టాలి.

    1. If you have evidence, what are you waiting for? Go and file a case withbyour evidences. Shamelessly defending you ill doings by blaming others will not help

      Kootami.

  9. Yajamaani కోసం. నీతి గా మొరిగే కు. క్క. లు. ఈ భూమి మీద అరుదు అలాంటి అరుదు లో. ఇది. గొప్ప. ఆంధ్ర

          1. You are coming to the point now. Government had left it to MLA of each constituency to loot and share it with leaders and that is why all 175 constituencies are having syndicates. No law and order or control on their own party leaders, leave alone other party leaders.

          2. So, you are saying with Kootami having useless law and order system Jagan and anyone can form a liquor syndicate and loot state treasure. Good going!!

          3. So, you are saying ABN chose to spread fake propaganda from blue batch because they did not have any news to run. Poor ABN should have taken help from iTDP for getting fake news and graphic content.

          1. Yes, they are saying CBN is doing good promoting corruption and doing good expediting privatization of steel plant, doing good in increasing prices of essential commodities.

          2. Now both blue and yellow media joined hands to expose Kootami looting. Poor CBN is confused as to which one he should focus first, backstabbing of yellow media or looting being done by his yellow leaders.

Comments are closed.