టీజర్ వస్తోంది.. మరి రిలీజ్ డేట్ వస్తుందా?

కన్నప్ప సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మంచు విష్ణు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. చివరికి ఈ సినిమా టీజర్ ను కూడా కాన్స్ చిత్రోత్సవంలో లాంచ్ చేశాడు తప్ప తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకు…

కన్నప్ప సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మంచు విష్ణు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. చివరికి ఈ సినిమా టీజర్ ను కూడా కాన్స్ చిత్రోత్సవంలో లాంచ్ చేశాడు తప్ప తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకు చూపించలేదు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.

మరో వారం రోజుల్లో, అంటే ఈనెల 14వ తేదీన కన్నప్ప టీజర్ ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ఈ హీరో. ఈ మేరకు సినిమా నుంచి మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు.

అన్నీ తానై కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు విష్ణు. మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో పూర్తిచేశాడు. కీలక పాత్రలు, అతిథి పాత్రల షూటింగ్స్ అన్నీ హైదరాబాద్ లో పెట్టుకున్నాడు. అలా అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి స్టార్స్ తో షూటింగ్ పూర్తిచేశాడు.

వీళ్లతో పాటు ఇందులో మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. వాళ్ల పాత్రలేంటి, ఆ పాత్రల నిడివి ఎంతనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

టీజర్ తో సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారా చేయరా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, కన్నప్ప సినిమా కోసం భారీ గ్రాఫిక్స్ వర్క్ నడుస్తోంది. అది కొలిక్కి వస్తే తప్ప రిలీజ్ డేట్ ప్రకటించడం సాధ్యం కాదు. ఒకవేళ టీజర్ తో పాటు విడుదల తేదీ ప్రకటిస్తే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కొలిక్కి వచ్చిందని అర్థం.