వాళ్లిద్దరు మరోసారి కలుస్తున్నారట?

అల్లు అర్జున్ సినిమాతో సమంత గ్లామరస్ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తుందంటూ ఆ మధ్య ఓ రేంజ్ లో పుకార్లు నడిచాయి. ఎప్పుడైతే సమంత, తన సొంత బ్యానర్ పై ఫిమేల్ ఓరియంటెండ్ మూవీ…

అల్లు అర్జున్ సినిమాతో సమంత గ్లామరస్ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తుందంటూ ఆ మధ్య ఓ రేంజ్ లో పుకార్లు నడిచాయి. ఎప్పుడైతే సమంత, తన సొంత బ్యానర్ పై ఫిమేల్ ఓరియంటెండ్ మూవీ ప్రకటించిందో, ఆ రూమర్లకు చెక్ పడింది.

అయితే ఇప్పుడు మరోసారి సమంతపై అదే తరహా రూమర్లు వస్తున్నాయి. ఈసారి హీరో మారాడు. బన్నీ బదులు విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఖుషి సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే టాక్ నడుస్తోంది. దిల్ రాజు బ్యానర్ పై రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇందులో సమంతను హీరోయిన్ గా ట్రై చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదొర రూరల్ యాక్షన్ డ్రామా. ఇంతకుముందు రంగస్థలం లాంటి సినిమాలో రూరల్ లుక్ లో కనిపించిన అనుభవం సమంతకు ఉంది. అందుకే ఆమె పేరు వినిపిస్తోంది.

అయితే సమంత నిజంగానే విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుందా లేక ఇది కూడా పుకారుగానే మిగిలిపోతుందా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ‘మా ఇంటి బంగారం’. తన సొంత బ్యానర్ పై సమంత నటిస్తూ, నిర్మించబోతున్న సినిమా ఇది.