సలార్ ట్రయిలర్ రిలీజ్.. ప్రభాస్ వస్తాడా రాడా..?

సలార్ స్టేటస్ మనందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ హెల్త్ స్టేటస్ కూడా అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి టైమ్ లో సలార్ ప్రచారానికి ప్రభాస్ వస్తాడా? మరీ ముఖ్యంగా సలార్ ట్రయిలర్ లాంచ్ కు…

సలార్ స్టేటస్ మనందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ హెల్త్ స్టేటస్ కూడా అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి టైమ్ లో సలార్ ప్రచారానికి ప్రభాస్ వస్తాడా? మరీ ముఖ్యంగా సలార్ ట్రయిలర్ లాంచ్ కు ప్రభాస్ హాజరవుతాడా?

ప్రభాస్ మోకాలి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటు నవంబర్ రెండో వారంలో సలార్ ట్రయిలర్ లాంఛ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రభాస్, ఈ ట్రయిలర్ లాంచ్ నాటికి అందుబాటులోకి వస్తాడా?

తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ మొదటివారానికే ప్రభాస్ ఇంటికొస్తున్నాడు. అయితే ఆ వెంటనే అతడు తన సినిమా పనుల్లో పడతాడా.. లేక మరికొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడా అనేది తేలాల్సి ఉంది. అతడు ఇంటికే పరిమితమైతే, ప్రభాస్ లేకుండానే ట్రయిలర్ లాంచ్ జరిగిపోతుంది. ఒకవేళ ప్రభాస్ వస్తే కనుక, లాంగ్ గ్యాప్ తర్వాత అతడు మరోసారి మీడియా ముందుకు, ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టవుతుంది.

ఫ్యాన్స్ మాత్రం ఈ ఇష్యూలో ప్రభాస్ వైపే ఉన్నారు. ట్రయిలర్ ను చెప్పిన తేదీకి యూట్యూబ్ లో రిలీజ్ చేసి, ఆ తర్వాత అసలైన ప్రమోషన్ టైమ్ కు ప్రభాస్ పూర్తిగా కోలుకొని బయటకొస్తే చాలంటున్నారు.

ప్రస్తుతానికైతే ప్రభాస్ నుంచి ఇటు సలార్ యూనిట్ కు, అటు మిగతా సినిమాల యూనిట్లకు ఎలాంటి సమాచారం లేదు. కుదిరితే వచ్చే నెల 6వ తేదీకి హైదరాబాద్ రావొచ్చు అనే సమాచారం మాత్రమే ఉంది. అంతకుమించి ఎవ్వరికీ ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు ప్రభాస్.