హీరో సుహాస్ లేటెస్ట్ సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో నడిచి ఓ మిడిల్ క్లాస్ సరదా స్టోరీ. ట్రయిలర్ లో ఏమీ దాచలేదు. ప్రతి పాత్ర..తీరుతెన్నులు..హీరో..ప్రేమ వ్యవహారం..చిన్న ట్విస్ట్..దాని వెనుక ఓ అబద్దం. దాని వల్ల వచ్చే అపార్థాలు ఇలా మొత్తం లైన్ లో గ్లింప్స్ చూపించేసారు.
పెద్దగా వావ్ మూవ్ మెంట్స్ లేవు. కొత్తగా అనిపించలేదు. కానీ ఓ నాచురల్ క్లీన్ లవ్ స్టోరీ ని తెర మీదకు వస్తోందనే ఫీల్ ను మాత్రం కలిగించింది. చిన్న చిన్న ఫన్ మూవ్ మెంట్స్ ట్రయిలర్ లో చోటు చేసుకుని, కాస్త ఇంట్రస్ట్ జనరేట్ చేసే ప్రయత్నం చేసాయి. కానీ థియేటర్ కు జనాలను రప్పించడానికి ఈ కంటెంట్ సరిపోతుందా? అన్నదే చిన్న అనుమానం.
సుహాస్ నటన సహజంగా వుంటుంది. అతనికి తగిన పాత్ర ఇది. మిగిలిన వారంతా కూడా పెర్ ఫెక్ట్ ఛాయిస్ అన్నట్లు వున్నారు. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఓకె. చిన్న సినిమా అయినా క్వాలిటీ బాగానే వుందని ట్రయిలర్ చెబుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్లలోకి వస్తోంది.