రైటర్ పద్మభూషణ్

చిన్న చిన్న పాత్రలు వేస్తూ, హీరోగా మారిన నటుడు సుహాస్. అతగాడి లేటెస్ట్ సినిమా టైటిల్ కూడా వైవిధ్యంగా వుంది. రైటర్ పద్మభూషణ్ అన్నది టైటిల్.  Advertisement లహరి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో…

చిన్న చిన్న పాత్రలు వేస్తూ, హీరోగా మారిన నటుడు సుహాస్. అతగాడి లేటెస్ట్ సినిమా టైటిల్ కూడా వైవిధ్యంగా వుంది. రైటర్ పద్మభూషణ్ అన్నది టైటిల్. 

లహరి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒకే మంచి పాట వుంది. ఆ పాటను ఈ రోజు విడుదల చేసారు. ‘కన్నుల్లో నీ రూపమే’ అంటూ సాగే ఈ పాటకు శేఖర్ చంద్ర స్వరకల్పన చేసారు. 

సున్నితమైన ఈ మెలోడీ గీతంను భాస్కర భట్ల రాసారు. ధనుంజయ్ ఆలపించారు. సుహాస్ కు జంటగా టీనా శిల్పరాజ్ నటిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. 

వెంకట్ శాఖమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్రలోకి వస్తుంది. చంద్ర మన్మోహన్ నిర్మాత. లహరి అడియో సంస్థ సమర్పణ.