Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

లండన్ లో అఖిల్ మూడో సినిమా

లండన్ లో అఖిల్ మూడో సినిమా

చాన్నాళ్ల కిందటే లాంఛ్ అయిన అఖిల్ మూడో సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. లండన్ లో అఖిల్ మూడో సినిమా షూటింగ్ మొదలైంది.

నిజానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 3 వారాల కిందటే స్టార్ట్ అవ్వాలి. కానీ వీసాల మంజూరులో జాప్యం కారణంగా సినిమా ఆలస్యమైంది. తాజాగా వీసా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకొని లండన్ చేరుకున్న యూనిట్ షూటింగ్ మొదలుపెట్టింది. 

దర్శకుడు వెంకీ అట్లూరికి ఇది సెంటిమెంట్ ప్లేస్. తన ఫస్ట్ మూవీ తొలిప్రేమ షూటింగ్ ఇక్కడే చేశాడు వెంకీ. అది హిట్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను అఖిల్ సినిమాకు కూడా కొనసాగిస్తున్నాడు. మూవీకి సంబంధించి మేజర్  పార్ట్ షూటింగ్ లండన్ లోనే పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారు. కథ ప్రకారం అలానే చేయాలట. 

అఖిల్ డెబ్యూ మూవీతో పాటు రెండో సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అఖిల్ సినిమా డిజాస్టర్ అయితే, హలో సినిమా ఫ్లాప్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు అఖిల్. మూడో సినిమాపై అంచనాలు పెంచేలా వ్యవహరించకూడదని డిసైడ్ అయ్యాడు. 

అటు నాగార్జున కూడా అఖిల్ మూడో సినిమాకు పూర్తి దూరంగా ఉంటున్నాడు. తొలి 2 సినిమాలకు అన్నీతానై వ్యవహరించిన నాగ్, మూడో సినిమాను మాత్రం పూర్తిగా అఖిల్ కే వదిలిపెట్టాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?