Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'జార్జిరెడ్డి' గంధర్వ

'జార్జిరెడ్డి' గంధర్వ

'వంగవీటి, 'జార్జిరెడ్డి' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ‘గంధర్వ’  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా ఓ డిఫ‌రెంట్ రోల్‌లో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. 

ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో సందీప్ మాధ‌వ్ రౌడీల‌ను చిత‌క్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి క‌ట్టేయ‌బ‌డి ఉన్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే గంధ‌ర్వ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తుంది. 

సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజ‌న్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?