ప్రతిరోజూ పండగే లాంటి హిట్ సినిమా తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా రిపబ్లిక్. టైటిల్ మాత్రమే కాదు దర్శకుడు దేవా కట్టా అన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్ నే.
తెరపై భావోద్వేగాలు పండించడంలో దేవా ది ఓ భిన్నమైన శైలి. ఆయన ప్రస్థానం సినిమా ఇప్పటికీ జనం మరిచిపోలేరు.
ఇన్నాళ్ల తరువాత మళ్లీ పొలిటికల్ టచ్ వున్న సినిమాను అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ జిల్లా కలెక్టర్ పంజా అభిరామ్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు లది కీలకపాత్రలు. ఐశ్వర్య రాజేష్ నాయిక.
వెస్ట్ గోదావరి కొల్లేరు సరస్సు నేపథ్యంలో, అక్కడి ప్రజా సమస్యల నేపథ్యంలో అల్లుకున్న కథతో రిపబ్లిక్ ను రూపొందించారు. ఈ సినిమాను అక్టోబర్ ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.