cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: శకుంతల దేవి

సినిమా రివ్యూ: శకుంతల దేవి

సమీక్ష: శకుంతల దేవి (హిందీ)
రేటింగ్: 2.5/5
బ్యానర్:
సోనీ పిక్చర్స్, అబుదాంటియా ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: విద్యబాలన్, సాన్య మల్హోత్రా, జిషుసేన్ గుప్తా, అమిత్ సాద్, షీబా చద్దా తదితరులు
బాణీలు: సచిన్ జిగర్
నేపథ్య సంగీతం: కరణ్ కులకర్ణి
కూర్పు: అంతర హిరి
ఛాయాగ్రహణం: కీకో నాకాహర
రచన: ఇషిత మొయిత్రా, అను మీనన్, నయనికా మహ్తాని
నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, సోనీ పిక్చర్స్ ఇండియా
దర్శకత్వం: అను మీనన్
విడుదల తేదీ: జులై 31, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్

ఒక బయోపిక్ చూస్తే సదరు వ్యక్తి గురించిన సమగ్ర సమాచారం తెలియకపోయినా... చాలావరకు తెలిసిపోతుంది. కానీ ‘శకుంతల దేవి’ చూస్తే ఆ మ్యాథ్స్ జీనియస్ గురించి రవంత మాత్రమే తెలుస్తుంది. ఆమె గురించి ఇంకాస్త తెలుసుకోవడం కోసం ‘గూగుల్’ చేయాల్సి వస్తుందంటే సదరు బయోపిక్ ఆమె కథను చెప్పడంలో ఎంత విఫలమై వుంటుంది?

‘హ్యూమన్ క్యాలుక్యులేటింగ్ మెషీన్’గా పేర్గాంచిన శకుంతల దేవి నిజంగానే ఓ మిస్టరీ. బేసిక్ ఎడుే్యకషన్ లేకుండా ఆమె మ్యాథమెటికల్ జీనియస్‌గా ఎలా మారారు... కంప్యూటర్ల కంటే వేగంగా ఎంత పెద్ద లెక్కలయినా ఎలా పరిష్కరించగలిగారు అనేది సైన్స్‌కి కూడా అందలేదు. కొందరు ఆమె సైకాలజీని, నంబర్లను ఆమె చూసే విధానాన్ని స్టడీ చేసి ఫలానా విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వుంటారని థియరీలు రాసారు. ఈ చిత్రం ఆ మిస్టరీ జోలికి పోలేదు. ‘‘చెట్టులా ఒకేచోట వుండిపోకూడదు... పక్షిలా ఎగరాలి’’ అనే ఆమె ఆలోచనలు, మేథస్సు... తనను, తన కుటుంబాన్ని, తన కుమార్తెను ఏ విధంగా ఎఫెక్ట్ చేసాయి లాంటి అంశాల మీదే ఫోకస్ పెట్టారు. 

సదరు తల్లికూతురు కాన్‌ఫ్లిక్ట్‌లోను రెండు పేరాలకు మించిన స్టఫ్ లేదు. వారి నడుమ సన్నివేశాలు కూడా అవే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ వుంటాయి. ఈ రిపీట్ సన్నివేశాల నుంచి దృష్టి మరల్చడానికో, లేదా కథాపరంగా లేని లోతుని పూడ్చడానికో ‘బ్యాక్ అండ్ ఫోర్త్’ టెక్నిక్‌తో సన్నివేశాలను జంబ్లింగ్ చేసారు. అయినప్పటికీ సదరు కాన్‌ఫ్లిక్ట్, ఎమోషన్ ఆల్రెడీ చూపించేసిందే కావడంతో చాలా సన్నివేశాలు కేవలం గ్యాప్ ఫిల్లర్స్‌లా అనిపిస్తాయి. 

అలా అని ఆమె గణిత శాస్త్ర ప్రావీణ్యం గురించి లోతుగా చెప్పడానికి, ఆ ప్రాసెసింగ్ స్క్రీన్‌పైకి తీసుకురావడానికి తగినంత ఇన్‌ఫర్మేషన్ ఈ సినిమా రూపకర్తల వద్ద లేదు. సో... ఈ కథను ఆమె కూతురి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకోవడం మంచి ఐడియా. కానీ వారి మధ్య ఎమోషనల్‌గా కదిలించే డ్రామా సృష్టించడంలో రైటర్స్, డైరెక్టర్ ఫెయిలయ్యారు. ఆమె తన గురించి తప్ప ఎదుటివారి గురించి ఆలోచించదని, తన కలలు, తన ప్రపంచమే తప్ప ఎదుటి వారికీ కలలు, ఆశలుంటాయని గుర్తించదనే యాంగిల్‌ని కొంతవరకు స్ట్రెస్ చేసారు. అయితే ఆమె అలా అయిపోవడానికి చూపించిన కారణాలు, సంఘటనలు అంత ఎఫెక్టివ్‌గా లేవు. 

తన బుక్ సేల్ చేయడం కోసం తన మాజీ భర్తను ‘ెమోసెక్సువల్’గా చిత్రీకరించడానికి కూడా శకుంతల వెనుకాడదని చూపించారు. ఈ గ్రే షేడ్ కూడా జస్ట్ అలా ‘కమ్ అండ్ గో’ అన్నట్టు వచ్చిపోతుందే తప్ప డ్రామాకి హెల్ప్ అవదు. స్టేజీపై వున్నపుడు, లేదా సెంరాఫ్ అట్రాక్షన్ అయినపుడు ఆమెలో రెట్టించిన ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తాయి. అక్కడ లేనపుడు తనను తాను ఎలా మిస్ అవుతున్నదీ, ఆ లైమ్‌లైట్ తనపై లేనపుడు ఎలా స్ట్రగుల్ అవుతున్నదీ లాంటి అంశాలపై ఫోకస్ చేసినా శకుంతల దేవి మైండ్‌సెట్ గురించిన ఇన్‌సైట్ ఇచ్చినట్టయ్యేది. 

ఇక జీవితమంతా అలా ‘ఎగురుతూ’ బ్రతికేసిన స్త్రీ ఎందుకు ‘దిగివచ్చింది’, ఎలా తన తప్పులు తెలుసుకుని రియలైజ్ అయినదీ కూడా ప్రభావవంతంగా చూపించలేదు. తన తల్లిని చూసి అసలు జీవితంలో మాతృత్వమే వద్దని అనుకున్న శకుంతల దేవి కూతురు అనుపమ తల్లయిన తర్వాత మాత్రం ఎలాగో తన తల్లి గొప్పతనాన్ని, త్యాగాన్ని తెలిసేసుకుందని మాటల్లో చెప్తారు. కానీ అలాంటి వాటికి సన్నివేశ బలం కావాలి కానీ మాటలతో కానిచ్చేస్తే ఆ సంఘర్షణ ఏమిటనేది అర్థం కాదు. తల్లిపై కూతురు క్రిమినల్ కేసు వేయడమనే పాయింట్‌పై ఆసక్తికరంగా స్టార్ట్ చేసారు కానీ మళ్లీ పతాక సన్నివేశంలో ఆ సీన్ వచ్చే వరకు ఆ సంగతి గుర్తు రాదు. అంత నిరాసక్తంగా నడుస్తుంది నడుమన డ్రామా. 

శకుంతల దేవి పాత్రలో విద్యాబాలన్ అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఒక్కోసారి దర్శకులు, రచయితలు ఇవ్వలేకపోయిన ఇన్‌సైట్ విద్యాబాలన్ తన నటనతో ఆ క్యారెక్టర్ తాలూకు భావోద్వేగాలను తెలియజేయగలిగింది. ఎక్కడా ఇన్‌వాల్వ్ చేయలేకపోయిన ఈ డ్రామాని ఆసాంతం చూడగలిగేలా చేసింది ఆమె ఛార్మింగ్ పర్‌ఫార్మెన్స్. ఆమె కూతురిగా సాన్య మల్హోత్రా కూడా చక్కని నటన ప్రదర్శించింది. ఇతర పాత్రధారులలో అమిత్ సాద్, జిషుసేన్‌గుప్తా మెప్పిస్తారు. సంగీతం సోసోగా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. టైమ్‌లైన్స్ అటు, ఇటు మారిపోతూ వున్నా కానీ ఎడిటింగ్ చాలా ఎఫెక్టివ్‌గా వుంది. అను మీనన్, ఆమె బృందం తమ సోర్స్ మెటీరియల్ గురించి తగినంత రీసెర్చ్ చేసినట్టు అనిపించదు. రియల్ లైఫ్ స్టోరీని సినిమాటిక్‌గా ప్రెజెంట్ చేయడానికి లిబర్టీస్ తీసుకున్నా కానీ ఆ స్టోరీని అరెస్టింగ్‌గా చెప్పడంలోను రైటర్స్ అండ్ డైరెక్టర్ విఫలమయ్యారు. 

మూడు గంటల్లోపే ‘మహానటి’ సావిత్రి జీవితాన్ని మొత్తం నాగ్ అశ్విన్ వెండితెరపై పరిచేయగలిగితే, రెండు గంటలకు పైగా సినిమా తీసి కూడా శకుంతల దేవి గురించిన గ్లింప్సెస్ మినహా ఏమీ తెలియజేయలేకపోయారు వీళ్లు. ఒక సినీ నటి జీవితంలో వున్నంత డ్రామా మ్యాథమెటీషియన్ జీవితంలో ఏముంటుంది అంటారా? ‘ఏ బ్యూటిఫుల్ మైండ్’ అనే రసెల్ క్రో నటించిన సినిమా కూడా ఓ మ్యాథ్స్ జీనియస్‌కి సంబంధించిన బయోగ్రాఫికల్ డ్రామానే. ఆస్కార్ గెలుచుకున్న ఆ చిత్రం ముందు మన మ్యాథ్స్ జీనియస్ సినిమా దూదిపింజలా తేలిపోతుంది. 

బాటమ్ లైన్: లెక్క తప్పింది!

గణేష్ రావూరి