Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

రవితేజ నిరాశ పరిచాడు. టచ్‌ చేసి చూడు చిత్రాన్ని టచ్‌ చేసిన ప్రేక్షకులు ఎందుకు టచ్‌ చేసామా అనుకునేలా చేసాడు. మొదటి వారాంతం తిరగకుండానే తిరోగమన దిశగా సాగిన ఈచిత్రం ఈయేడాదిలో మరో పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వచ్చే వారానికి థియేటర్లనుంచి పూర్తిగా కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

దీంతో పాటే విడుదలైన నాగశౌర్య సినిమా ఛలో హిట్టయింది. విడుదలైన నాటి నుంచే మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ యాత్రకి ఛలో అన్న ఈచిత్రానికి టాక్‌ కూడా బాగా రావడంతో బాక్సాఫీస్‌ని డామినేట్‌ చేసింది. నాగశౌర్య కెరీర్లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈచిత్రానికి ఈవీకెండ్‌ కూడా వసూళ్లు బాగుండే అవకాశాలు పుష్కలం.

భాగమతి తెలుగులో ఘన విజయాన్ని అందుకుంది కానీ తమిళ, మలయాళ వెర్షన్లు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈవారంలో మూడు కొత్త సినిమాలు రావడంతో మార్కెట్లో సినిమా కళ బాగా వుంది. అయితే ఇంటిలిజెంట్‌, తొలిప్రేమ, గాయత్రి చిత్రాల్లో ఏది మహాశివరాత్రి హాలిడేని క్యాష్‌ చేసుకునే టాక్‌ తెచ్చుకుంటుందనేది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?