Advertisement

Advertisement

indiaclicks

Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఎంఎల్‌ఏ చిత్రానికి ఓపెనింగ్‌ బాగా వచ్చినా కానీ ఆ తర్వాత చల్లబడింది. రికవర్‌ చేయాల్సిన అమౌంట్‌ చాలా వుంది కనుక ఫైనల్‌గా ఇది యావరేజ్‌ రేంజ్‌తో సరిపెట్టుకోవచ్చునని ట్రేడ్‌ చెబుతోంది. నీదీ నాదీ ఒకే కథ చిత్రం ఒక వర్గం క్లాస్‌ ఆడియన్స్‌ని ఆకర్షించగలిగింది. తక్కువ బడ్జెట్‌ సినిమా కనుక డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా నిర్మాతలకి ప్రాఫిటబుల్‌ వెంఛర్‌ అవుతుంది.

అంతకుముందు వారం విడుదలైన కిరాక్‌ పార్టీ ఫస్ట్‌ వీకెండ్‌ దాటిన తర్వాత దారుణంగా డ్రాప్‌ అయి మళ్లీ లేవలేకపోయింది. ఫైనల్‌గా ఇది నిఖిల్‌కి మరో ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈవారం విడుదలైన రంగస్థలం చిత్రానికి ఊహించినట్టుగానే బ్రహ్మాండమైన ఓపెనింగ్‌ వచ్చింది. అడ్వాన్స్‌ బుకింగ్‌ పరంగా ఆదివారం వరకు సేల్స్‌ బ్రహ్మాండంగా వున్నాయి.

టాక్‌ కూడా అనుకూలంగా వుండడం రంగస్థలంకి కలిసొచ్చే అంశం. అయితే కమర్షియల్‌ అంశాల పరంగా రెగ్యులర్‌ తెలుగు సినిమాలకి భిన్నంగా వుండడం వల్ల బి, సి సెంటర్స్‌లో లాంగ్‌ రన్‌ వుంటుందా లేదా అనేది సోమవారానికి తెలుస్తుంది. ఇకపై వారానికో నోటబుల్‌ రిలీజ్‌ వుండడంతో బాక్సాఫీస్‌ దగ్గర కంటిన్యూస్‌గా సందడి ఖాయమనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?