Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

గత వారం 'కాశి' మినహా మరే సినిమా లేకపోవడంతో 'మహానటి' ప్రస్థానం రెండవ వారంలోను ఘనంగానే సాగింది. పది రోజుల్లోనే ముప్పయ్‌ కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసిన 'మహానటి' ఇప్పటికీ మంచి షేర్స్‌తో రన్‌ అవుతోంది. అమెరికాలో రెండున్నర మిలియన్ల డాలర్లు వసూలు చేసే దిశగా సాగుతోన్న ఈ చిత్రం చిన్న చిత్రాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది.

ఇక కాశి విషయానికి వస్తే 'బిచ్చగాడు' ఫేమ్‌ విజయ్‌ ఆంటోని మళ్లీ పరాజయం మూటగట్టుకున్నాడు. బిచ్చగాడు తర్వాత ఇతను నటించిన సినిమా ఏదీ విజయం సాధించలేదు. కాశి పరాజయంతో అతడి తదుపరి చిత్రాలకి గిరాకీ పడిపోయే అవకాశం వుంది. రంగస్థలం యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని నాన్‌ బాహుబలి చిత్రాల్లో అతి పెద్ద విజయంగా నిలబడగా, భరత్‌ అనే నేను కూడా వంద కోట్ల షేర్‌ సాధించిన చిత్రాల సరసన నిలబడింది.

అల్లు అర్జున్‌ నటించిన 'నా పేరు సూర్య' మాత్రం అతనికి భారీ పరాజయాన్ని మిగిల్చింది. ఈ వారం రవితేజ చిత్రం 'నేల టిక్కెట్టు'తో పాటు నాగశౌర్య నటించిన 'అమ్మమ్మగారిల్లు' రిలీజ్‌ అయ్యాయి. ఈ చిత్రాలపై విడుదలకి ముందు అంతగా బజ్‌ లేదు కానీ పబ్లిక్‌ టాక్‌ని బట్టి పుంజుకుంటాయని నిర్మాతలు ఆశిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?