ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం వేరు. రెండు మూడు రోజులకు ఓ స్టిల్. దాంతో జనాల్లో ఆసక్తి పెరిగి, బజ్ వచ్చి, బిజినెస్ చేసుకోవచ్చన్న స్ట్రాటజీ డైరక్టర్ క్రిష్ ది. పబ్లిసిటీ వ్యవహారాలు అన్నీ ఆయనే భుజాన వేసుకుని, స్ట్రాటజీలు రాసుకుని చేస్తున్నారు. అంతవరకు బాగానే వుంది. అనుకున్నట్లు బిజినెస్ బ్రహ్మాండంగా అవుతోంది. దాదాపు ఫస్ట్ పార్ట్ లోనే పాతికకోట్లు నిర్మాతగా బాలయ్య వెనకేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కానీ ఇక్కడ అసలు విషయం వేరుగా వుంది. విడుదల చేస్తున్న స్టిల్స్ అన్నీ చూస్తుంటే, రకరకాల గెటప్ ల్లో బాలయ్యను చూపించి, గతంలో వచ్చిన చిటపట చినుకులు మాదిరిగా విడియో సాంగ్స్ అతికించినట్లు వుంటుంది సినిమా, బాలయ్యను రకరకాల గెటప్ ల్లో చూడొచ్చు. పాత సినిమాల సీన్లు వుంటాయి అని అభిమానులు అనుకుంటున్నారు.
అయితే ఈ పబ్లిసిటీ అంతా ప్లాన్ బి మాత్రమే. అసలు ప్లాన్ ఏ అలాగే వుందట. సినిమాలో ఈ గెటప్ లు, పాటలు, అంతా కలిపి ఎక్కువ భాగం వుండవట. సినిమా అంతా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎమోషన్లు, బంధాలు, అనుబంధాలు వగైరా సీరియస్ వ్యవహారాలు వుంటాయట.
అయితే జనాలకు సర్ప్రయిజ్ గా వుంటుందని ప్లాన్ ఎ అలా వుంచి సినిమా ఓపెనింగ్స్ కు, బిజినెస్ కు పనికివచ్చే ప్లాన్ బి ని అమలు చేస్తున్నారట. అదీసంగతి.