Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఓ గ్యాసిప్ మీద అంత హంగామా అవసరమా?

ఓ గ్యాసిప్ మీద అంత హంగామా అవసరమా?

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్. కోట్లాది మంది సినిమా అభిమానులు అనునిత్యం, అనుక్షణం, తమ అభిమాన నటుల లేదా అభిమాన దర్శకుల గురించి తెలుసుకోవాలని తపిస్తుంటారు. పైగా ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం. క్షణాల్లో సమాచారం ఈ మూల నుంచి ఆ మూలకు చేరిపోతోంది. అదీకాక, పెదవిదాటిన మాట పృధివి దాటుతుందని సామెత. దీనికితోడు శ్రీశ్రీనే అన్నాడు.. పబ్లిక్ లోకి వస్తే అంతా పబ్లిక్కే అన్న రీతిలో.

విషయానికి వస్తే, బన్నీ-త్రివిక్రమ్ కలిసి ఓ హిందీ సినిమా రీమేక్ చేయబోతున్నారని, ఆ హిందీ సినిమా టైటిల్ తో సహా గ్యాసిప్ అందించింది గ్రేట్ ఆంధ్ర. ఓ సినిమా డిస్కషన్ అంటే ఒకరిద్దరు వుండరు. హీరో, నిర్మాత, దర్శకుడు, వాళ్ల సన్నిహితులు, వాళ్ల బంధుబలగం, వాళ్ల స్నేహితులు ఇలా సవాలక్ష మంది వుంటారు. ఎక్కడో అక్కడ చిన్న లీక్ వుంటుంది. అది గ్యాసిప్ గా మారి, ఆ తరువాత వార్తగా ఫిక్స్ అవుతుంది.

పైగా ఇది పాజిటివ్ గ్యాసిప్. దీనివల్ల అటు హీరో, ఇటు దర్శకుడు ఎవరికీ ఏ నష్టంలేదు. పైగా అభిమానులకు ఆనందమే. తమ హీరో సినిమా ఫిక్స్ అవుతోందని. కానీ ఆ సినిమాకు సంబంధించిన వారు అలా అనుకోవడం లేదు.

ఎలా లీక్ అయింది? ఎవరు లీక్ చేసారు? ఎక్కడ నుంచి వెళ్లింది? దీనికి బాధ్యులు ఎవరు? ఎవరిపై చర్య తీసుకోవాలి? ఇలా ఒక ఆలోచన, ఓ డైరక్షన్ కాదు. సవాలక్ష డైరక్షన్లలో కిందామీదా అయిపోతున్నారు. బన్నీ తప్పు చేస్తున్నాడని అనలా? త్రివిక్రమ్ నిర్ణయం రాంగ్ అనలా? సినిమా ప్లానింగ్ బయటకు వచ్చింది. అంతే. దానికే ఎందుకో? ఈ సత్య శోధన? అపరాధ పరిశోధన?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?