Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బయోపిక్..పెద్దల్లుడు వచ్చాడు

బయోపిక్..పెద్దల్లుడు వచ్చాడు

ఎన్టీఆర్ బయోపిక్ లో పెద్దల్లుడిది చిన్న పీటే. అది ఇప్పటికే అర్థం అయిపోయింది. రానా లాంటి స్టార్ ను చంద్రబాబు పాత్రకు తీసుకుని, భరత్ రెడ్డి లాంటి చిన్న నటుడిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకు తీసుకున్నపుడే, ప్రయారిటీ అర్థం అయిపోయింది. ఇప్పటి వరకు అన్ని లుక్ లు ముందే వదిలిన బయోపిక్ మేకర్లు, ఇప్పుడు పెద్దల్లుడిగా భరత్ రెడ్డి లుక్ ను విడుదల చేసారు. 

అది కూడా ఇప్పుడు భరత్ రెడ్డి బర్త్ డే కాబట్టి, పనిలో పనిగా లుక్ ను బయటకు వదిలారు. ఎన్టీఆర్ గా బాలయ్య మెడలో దండలతో కనిపిస్తున్నాడు. వెనుక భరత్ రెడ్డి అండగా పెద్దల్లుడిగా కనిపిస్తున్నాడు. అంటే ఈ సీన్ బహుశా రెండో భాగంలోనిదే అనుకోవాలి. ఎన్టీఆర్ గా బాలయ్య గెటప్ కూడా రెండో భాగానికి సంబంధించినట్లే వుంది.

మరి ఇంతకీ బయోపిక్ బయటకు వస్తే తప్ప, పెద్దల్లుడి పాత్ర నిడివి ఏ మేరకు వుంటుంది, దాని ప్రాధాన్యత ఏ మేరకు వుంటుంది అన్నది తెలుస్తోంది. 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?