దేవుడు ఆగ్రహించిన ఊరు

దెయ్యం మీదకు వస్తే దేవుడిని శరణు అంటాం. దేవుడే ఆగ్రహిస్తే..ఎవర్ని శరణు అనాలి? ఏం చేయాలి? ఇదే కాన్సెప్ట్ తో తయారవుతున్న సినిమా సుబ్రహ్మణ్యపురం. గతంలో కార్తికేయ లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన నిర్మాతలే,…

దెయ్యం మీదకు వస్తే దేవుడిని శరణు అంటాం. దేవుడే ఆగ్రహిస్తే..ఎవర్ని శరణు అనాలి? ఏం చేయాలి? ఇదే కాన్సెప్ట్ తో తయారవుతున్న సినిమా సుబ్రహ్మణ్యపురం. గతంలో కార్తికేయ లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన నిర్మాతలే, మళ్లీ కార్తికేయుడి నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యపురం సినిమా కథను రూపొందించుకున్నారు.

ఒక ఊరు మొత్తం కార్తికేయుడి ఆగ్రహానికి గురయితే జనం ఏం ఇబ్బందులు పడ్డారు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి హీరో  ఏం చేసాడు అన్నది కాన్సెప్ట్.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేసారు. హీరో సుమంత్ 25వ సినిమాగా సుబ్రహ్మణ్యపురం రెడీ అవుతోంది. 

ఇటీవల 'మళ్ళీ రావా' వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'. చిత్రాన్ని టారస్ సినీకార్పు మరియు సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్  పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈషా కథానాయికగా నటిస్తున్నది. చిత్ర నిర్మాతలలో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూలై 1 న చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాతలు  చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. “సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ 'సుబ్రహ్మణ్యపురం'.  దేవుడంటే నమ్మకం లేని హీరో.. తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠత కలిగించే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ఉంటుంది.

జూన్ 18 నుంచి జూలై 1 వరకు జరిగిన రెండవ షెడ్యూల్ లో యానాం, కాకినాడ, అమలాపురంలోని సుందరమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాము. జూలై, ఆగష్టు లలో జరిగే షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. తప్పకుండా సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం వుంది” అని తెలిపారు.