మొత్తానికి వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా కష్టం గట్టెక్కింది. వైఎస్ రాజారెడ్డి లాంటి కీలకపాత్ర కోసం సరైన నటుడి అన్వేషణ పూర్తయింది. యాత్ర సినిమా స్క్రిప్ట్ టైమ్ లోనే తమిళనటుడు రాజ్ కిరణ్ ను అనుకున్నారు. కానీ ఆయన ముందుగా నో అన్నారు. ఆ తరువాత ఆయన ఊ అన్నా కూడా చెప్పిన రేటు వీళ్లకు నప్పలేదు.
శరత్ కుమార్ మొదలు చాలా మందిని అనుకున్నారు. ఆఖరికి తెలుగు నటుడే దొరికాడు. క్యారెక్టర్ పాత్రలతో తన సెకెండ్ ఇన్నింగ్స్ ను దున్నేస్తున్న జగపతి బాబును వైఎస్ రాజా రెడ్డి పాత్రకు ఒప్పించారు.
నిజానికి వైఎస్ బయోపిక్ అంటే తెలుగు నటులు అందరూ దూరంగా వుంటున్నారని సమాచారం. ఇప్పటి ఫిక్స్ అయిన తెలుగు నటుడు రావురమేష్ ఒక్కరే. ఆయన కేవిపి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు జగపతిబాబు రెండో తెలుగు నటుడు. ఆయన రాజారెడ్డి పాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా వుంటే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నాజర్ ను కూడా ఓ కీలకపాత్ర పోషించేందుకు తీసుకోబోతున్నట్లు సమాచారం. చిన్నతనంలో వైఎస్ ఆలనా పాలన చూసిన వెంకటప్ప అనే క్యారెక్టర్ ఒకటి వుంది. సినిమాలో అది కూడా కీలకమే. దానికోసం నాజర్ ను సంప్రదిస్తున్నారు. ఆయన ఓకె అన్నట్లే.