ఈ అమ్మాయికి హిట్టొస్తుందా.?

తొలి సినిమా ఫట్టయినా.. ఆమె గ్లామరస్‌ లుక్‌ కారణంగా, రెండో అవకాశంగా పెద్ద సినిమానే దక్కింది. ఏకంగా అల్లు అర్జున్‌ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన ఆ బ్యూటీ ఎవరో కాదు, కేథరీన్‌.…

తొలి సినిమా ఫట్టయినా.. ఆమె గ్లామరస్‌ లుక్‌ కారణంగా, రెండో అవకాశంగా పెద్ద సినిమానే దక్కింది. ఏకంగా అల్లు అర్జున్‌ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన ఆ బ్యూటీ ఎవరో కాదు, కేథరీన్‌. అయినాసరే, పాపం ఆమెకు సరైన హిట్‌ దొరకలేదు రెండో సినిమాతోనూ.

ప్రస్తుతం ‘పైసా’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది కేథరీన్‌. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి వుంది. చాలాకాలంగా ‘పైసా’ పాటలు మార్మోగిపోతున్నాయి టీవీల్లో. అయినా సినిమా విడుదల కావడంలేదు. పాటలు తీయడంలో స్పెషలిస్ట్‌ అయిన కృష్ణవంశీ, పైసా పాటల్లో కేథరీన్‌ని చాలా బాగా చూపించాడనే చెప్పాలి.

నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నానా పాట్లూ పడి ఎలాగోలా విడుదలకు సిద్ధమయ్యింది. అన్నట్టు, కేథరీన్‌ ‘రుద్రమదేవి’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది కేథరీన్‌.