రణ్‌భీర్ కపూర్ డేట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. యంగ్ హీరోల్లో రణ్‌భీర్‌కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ మరెవరికీ లేదు. ఖాన్ల త్రయం ఇప్పుడు లవ్‌స్టోరీస్ చేసే ఏజ్ దాటిపోవడంతో, హృతిక్ ప్రతి సినిమాకీ మధ్య చాలా గ్యాప్ తీసుకుంటూ ఉండడంతో ఇక మిగిలిన ఏకైక యంగ్ స్టార్ రణ్‌భీర్ అయ్యాడు.
అజయ్ దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్ కూడా బాగా ముదిరిపోవడంతో ఇక రణ్‌భీర్‌కి ఎదురు లేకుండా పోయింది. ‘యే జవానీ హై దీవానీ’ సినిమా 190 కోట్ల వసూళ్లు సాధించడంతో అతని డిమాండ్ అమాంతం డబుల్ అయింది. ‘బేషరమ్’ కూడా హిట్ అయి ఉంటే రణభీర్ రేంజ్ మరోలా ఉండేదిపుడు. అయితే దురదృష్టవశాత్తూ బేషరమ్‌గా ఫ్లాపయ్యాడు.
అయినప్పటికీ రణ్‌భీర్ క్రేజ్ ఏమీ తగ్గలేదు. ‘బేషరమ్’కి అతనికి అన్ని హక్కుల రూపంలో ఇరవై కోట్లు వచ్చాయట. ఈ చిత్రం కనుక హిట్ అయి ఉంటే అతని షేర్ మరింత ఎక్కువ ఉండేదట. ఈ చిత్రం ఫ్లాప్ అయినా దాని ఎఫెక్ట్ అతనిపై ఏమాత్రం పడలేదు. అతను సైన్ చేసే తదుపరి చిత్రానికి పాతిక కోట్లు ఇవ్వడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు.