చాలా కాలంగా విడుదల కాకుండా వాయిదా పడుతున్న ‘ఎవడు’ డిసెంబర్ 19న విడుదల కాబోతోంది. ఆ టైమ్‌కి థియేటర్లు బుక్ చేసుకోమని దిల్ రాజు ఆల్రెడీ బయ్యర్స్‌కి చెప్పాడట. ఈ చిత్రం సంక్రాంతికి రావచ్చునని వార్తలు వినిపిస్తున్నా కానీ డిసెంబర్ 19న ఖాయమైనట్టేనని అంటున్నారు.
అయితే ఇంతకాలం ఆగిన తర్వాత ఇలా బ్యాడ్ సీజన్‌లో ఎవడు రిలీజ్ చేయడం వల్ల ఆల్రెడీ స్టేల్ అయిందనే ఫీల్ ఉన్న ప్రోడక్ట్‌కి నష్టమని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. దానికంటే సంక్రాంతికి ‘1’ సినిమాకి పోటీగా దీనిని రిలీజ్ చేసినట్టయితే లాభం ఎక్కువ ఉంటుందని, దానితో పోటీ ఉండడం వల్ల దీనికి క్రేజ్ పెరుగుతుందని అంటున్నారు.
‘ఎవడు’ చిత్రానికి ఇన్‌సైడ్ టాక్ బాగుంది కానీ కంటెంట్ కంటే రిలీజ్ టైమింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దిల్ రాజుకి ఇదంతా తెలియనిది కాదు. మరి అతను రిస్క్ తీసుకుని ‘1’తో పోటీగా ‘ఎవడు’ రిలీజ్ చేస్తాడో, లేక సేఫ్టీ చూసుకుని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామనుకుంటాడో చూడాలి. ఆల్రెడీ రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌తో అతని బ్యానర్ బ్రాండ్ వేల్యూ తగ్గింది. ఇప్పుడతనికి మరో ఫెయిల్యూర్ అస్సలు మంచిది కాదు.