లీక్ కాస్తా ఫేక్ అయింది

డిజిటలైజేషన్ వచ్చిన తరువాత కంటెంట్ ను కాపాడడం కష్టం అవుతోంది. ఎక్కడో ఓ చిన్న లింక్ లో లీక్ అయిపోతోంది. దాంతో తూచ్..అది ఫేక్..అంటూ, విడుదల వాయిదా వేసి, మళ్లీ ఏదో ఒకటి తయారుచేయడం…

డిజిటలైజేషన్ వచ్చిన తరువాత కంటెంట్ ను కాపాడడం కష్టం అవుతోంది. ఎక్కడో ఓ చిన్న లింక్ లో లీక్ అయిపోతోంది. దాంతో తూచ్..అది ఫేక్..అంటూ, విడుదల వాయిదా వేసి, మళ్లీ ఏదో ఒకటి తయారుచేయడం అన్నది కామన్ అయిపోయింది. శైలజరెడ్డి అల్లుడు వ్యవహారం కూడా అలాంటిదేనా? లేక దీని వెనుక ఇంకేమయినా వుందా?

శైలజరెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ అంటూ నిన్నటికి నిన్న సోషల్ నెట్ వర్క్ లో చక్కర్లు కొట్టింది పక్కా ఒరిజినల్ పోస్టర్ అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. దీన్ని వారంరోజులు ముందే చేయించారు. ఇది మరో పోస్టర్ చేయించారు. అయితే లోగోలు మాత్రం ఓ అరడజను చేయించినట్లు తెలుస్తోంది. సరైన లోగో ఎంపిక చేసి, పోస్టర్ మీద రీప్లేస్ చేయాల్సి వుంది.

ఇలాంటి టైమ్ లో అది లీక్ అయిపొయింది. దీంతో ఎలాగూ లోగో చేంజ్ వుంటుంది కదా? అని అబ్బే.. అది ఫేక్ అని ప్రకటించేసారు. మరోపక్క సవ్యసాచి టీమ్ తో మాట్లాడాక కానీ, ఫస్ట్ లుక్ వద్దని హీరో నాగ్ చైతన్య క్లియర్ గా చెప్పేసాడు. అందువల్ల ఎలాగూ వాయిదా తప్పలేదు. ఇక్కడ చిన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

చైతన్య మాట కొట్టేయలేక, లుక్ వాయిదా అయితే వేసారు కానీ, ఎక్కడి నుంచో లీక్ చేయించేసారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముహుర్తాల మీద నమ్మకం వున్న జనాలు అనుకున్న ముహుర్తానికి లుక్ ఏదో విధంగా బయటకు వెళ్లేలా చేసారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు చైతూ ఓకే అన్నాక, లోగో మార్చి మళ్లీ కాస్త యాంగిల్ మార్చి వదులుతారని తెలుస్తోంది. ఈలోగా బయటకు వచ్చిన లుక్ మీద రకరకాల ట్వీట్ లు వచ్చేసాయి. బాగుందని చాలామంది, చైతూ సూపర్ అని ఇంకొంత మంది ట్వీట్లు చేసారు. నెగిటివ్ లు కూడా బాగానే వున్నాయి. అది వేరే సంగతి.