మోక్షజ్ఞ ఎంట్రీ సంగతేమిటి?

అన్నిపెద్ద కుటుంబాలకు చెందిన వారసులు సినిమా రంగంలోకి ముందో, వెనకో వస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ వారసుడు వచ్చే జాడ మాత్రం కనిపించడం లేదు. ఏడాది క్రితం మోక్షజ్ఞ ఎంట్రీ కాస్త వార్తల్లో నిలిచింది.…

అన్నిపెద్ద కుటుంబాలకు చెందిన వారసులు సినిమా రంగంలోకి ముందో, వెనకో వస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ వారసుడు వచ్చే జాడ మాత్రం కనిపించడం లేదు. ఏడాది క్రితం మోక్షజ్ఞ ఎంట్రీ కాస్త వార్తల్లో నిలిచింది. బాలయ్య సన్నిహితుడు సాయి కొర్రపాటి తానే మోక్షజ్ఞ సినిమాను నిర్మిస్తానని చాలాసార్లు చెప్పారు. ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు అప్పట్లో వినిపించింది. మరి ఆ తరువాత ఇక ఆ ప్రస్తావన లేదు.

ఈ మధ్య బాలయ్య చేసే సినిమాల మీదే తప్ప, మోక్షజ్ఞ గురించి ఒక్కవార్త కూడా లేదు. ఎన్టీఆర్ బయోపిక్, బోయపాటి సినిమా, వినాయక్ సినిమా అంటూ ఆ వార్తలే తప్ప, మోక్షజ్ఞ ఎంట్రీ మీద ఒక్క వార్తా లేదు. మరోపక్క బయోపిక్ లో ఎవరి ఎవరి పేర్లో వినిపిస్తున్నాయి కానీ, మోక్షజ్ఞ పేరు వినిపించడం లేదు. ఇదిలా వుంటే ఇటీవల మోక్షజ్ఞ తరచు ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ లో మిత్రులతో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. 

కానీ మోక్షజ్ఞ వయసు మించిన భారీ శరీరంతో కనిపిస్తున్నాడని అంటున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అంటే మాత్రం మోక్షజ్ఞ చాలా వర్కవుట్ చేసి, శరీరాకృతి బాగా తగ్గించుకోవాలని టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ ఓ మూడునెలల్లో బాగా పెర్ ఫెక్ట్ ఫిజిక్ తో రాగలిగితే కనుక, ఎన్టీఆర్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లతో బయోపిక్ లో తెరంగ్రేటం చేయించేద్దామని క్రిష్ సలహా కూడా ఇచ్చినట్లు వినిపిస్తోంది.

ఒకపక్క రాజకీయాలు, నియోజక వర్గ సమస్యలు, మరోపక్క క్యాన్సర్ ఆసుపత్రి విస్తరణ పనులు, ఇంకోపక్క బయోపిక్ ఇలా అన్నివిధాలా బిజీ అయిపోయారు బాలకృష్ణ. మరి మోక్షజ్ఞ గురించి ఎప్పుడు ఆలోచిస్తారో? తన సినీ వారసుడిని ఎప్పుడు అందిస్తారో?