ఏపీలో ఒకే రోజు 2 పాజిటివ్ కేసులు

మొన్నటివరకు భయం లేదనుకున్నారు. ఏపీలో అంతగా ప్రభావం చూపించదనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకేరోజు 2 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖలో కరోనా కేసులు బయటపడగా.. తాజాగా విజయవాడ,…

మొన్నటివరకు భయం లేదనుకున్నారు. ఏపీలో అంతగా ప్రభావం చూపించదనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకేరోజు 2 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖలో కరోనా కేసులు బయటపడగా.. తాజాగా విజయవాడ, రాజమండ్రిలో కూడా 2 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది. దీంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

లండన్ నుంచి ఓ యువకుడు ఈనెల 20న రాజమండ్రి వచ్చాడు. ఎయిర్ పోర్ట్ లో అతడికి థర్మల్ స్క్రీనింగ్ చేశాడు. అప్పుడు ఎలాంటి టెంపరేచర్ కనిపించలేదు. కానీ ఇప్పుడు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక ఈనెల 15న ఓ యువకుడు జర్మనీ నుంచి ఢిల్లీ వచ్చాడు. అట్నుంచి అటు 17న విజయవాడ చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో 20న ఆస్పత్రిలో చేరాడు. ఇతడికి కూడా పాజిటివ్ వచ్చింది.

ప్రస్తుతం వీళ్లిద్దరు తిరిగిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల్ని ఆరా తీస్తున్నారు. ఈరోజు వాళ్లందర్నీ ఐసోలేషన్ వార్డులకు తరలించబోతున్నారు. మరోవైపు తెలంగాణ సర్కార్ బాటలోనే, ఏపీ సర్కార్ కూడా 2-3 ఏళ్ల కిందట రిటైర్ అయిన వైద్య సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. దీనికి సంబంధించి ఈరోజు మార్గదర్శకాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ మొదలైంది. ఈ సందర్భంగా పోలీసులందరూ విధుల్లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసులందరికీ శెలవులు రద్దు చేసింది.

కేసీఆర్ బతికున్నంత వరకూ ఏ కష్టం రాదు