పాలన ఎపుడు కేంద్ర స్థాయిలో ఉండకూడదు, అది దిగువకు రావాలి. గ్రామాల దాకా చేరాలి. దాన్నే గ్రామ స్వరాజ్యం అంటారు. ఇది మేధావులు కూడా చెప్పేమాట. ఇపుడు ఏపీలో వైఎస్ జగన్ అమలు చేస్తున్నది కూడా ఇదే. ఆయన గ్రామ సచివాలయాలను పెట్టి పాలనను పూర్తిగా పల్లెలకు చేర్చారు.
ఇక జగన్ మరో కాన్సెప్ట్ మూడు రాజధానులు. దీని వల్ల కూడా పాలన వికేంద్రీకరణతో పాటు ప్రాంతాల మధ్య అంతరాలు లేకుండా ఉంటాయన్న ఉన్నతమైన ఆలోచన, జగన్ ది దూరద్రుష్టి. మరో పదేళ్లకో, ఇరవయ్యేళ్ళకో మాకు ఈ పాలనలో న్యాయం జరగడంలేదు. అందువల్ల వేరు పడిపోతామని మరో ప్రాంతీయ ఉద్యమం ఎవరు చేయకుండా జగన్ అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు మూడు రాజధానులు అన్నారు.
మూడు రాజధానులు తెస్తే చంద్రబాబు వంటి వారికి నొప్పేంటి అంటున్నారు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వెనకబడిన ప్రాంతాలు అభివ్రుధ్ధి చెందకూడదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు నలభయ్యేళ్ల అనుభవం శాసనమండలి విలువను తగ్గించిందని ఆయన విమర్శలు చేశారు. పెద్ద మనుషులుగా ఉంటూ సలహాలు ఇస్తారనుకుంటే ఆఖరుకు ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా సున్నా చుట్టేసిన టీడీపీ తీరును జనం అసహ్యించుకుంటున్నారని తమ్మినేని హాట్ కామెంట్స్ చేశారు.
ఎవరెన్ని అనుకున్నా ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఫైనల్ అని, అక్కడ తీసుకున్న నిర్ణయలే శిరోధార్యమని తమ్మినేని అంటున్నారు. తొందరలోనే మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొంది ప్రజల కలలు సాకారం అవుతాయని ఆయన ధీమాగా చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు అనుభవం ప్రజలకు కీడే చేస్తోందని కూడా తమ్మినేని తేల్చేశారు.