జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఆ ప్రాతిప‌దిక వ‌ద్దు!

-రాయలసీమ భౌగోళిక ఆస్తిత్వాన్ని దెబ్బతీయకూడదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం తీసుకోబోతున్న  నిర్ణయం ఏపీ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే ముందు పాలన పరమైన ఆంశాలతో బాటు…

-రాయలసీమ భౌగోళిక ఆస్తిత్వాన్ని దెబ్బతీయకూడదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం తీసుకోబోతున్న  నిర్ణయం ఏపీ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే ముందు పాలన పరమైన ఆంశాలతో బాటు చారిత్రక నేపథ్యం , ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు గాను కమిషన్ వేసి ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం చేయాలి.

పునర్వ్యవస్థీకరణ ఆవశ్యకత..
ఏపీలో ప్రస్తుతం ఉన్న2 జిల్లాల స్వరూపం ఏమాత్రం శాశ్రీయంగా లేదు. రాయలసీమలోని అనంతపురం , గుంటూరు , తూర్పుగోదావరి జిల్లాలు కొన్ని దేశాలను పోలి ఉంటుంది. పరిపాలన , అధికారుల స్వీయ పర్యవేక్షణకు ఆటంకం కలుగుతుంది. ఉదాహరణకు అనంతపురం జిల్లా దాదాపు ఉభయగోదావరి జిల్లాల విస్తీర్ణం ఉంటుంది. అందుకే జిల్లాల సంఖ్య 25 గా చేయడం సముచితమైన నిర్ణయం.

పునర్వ్యవస్థీకరణకు పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపది కాకూడదు..
పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు ఆలోచన అనేక సమస్యలకు కారణం కావచ్చు. చిత్తూరు జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు చిత్తూరు , తిరుపతిగా ఉన్నాయి. అతి పెద్ద డివిజన్ గా మదనపల్లె ఉన్నది. కానీ అది రాజంపేట నియోజకవర్గంలో ఉన్నది.  రాజంపేట జిల్లా అయితే పుంగనూరు , మదనపల్లె చాలా దూరం అవుతుంది. జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్న ప్రాథమిక సూత్రానికి ఇది విగాదం అవుతుంది. కడప , రాజంపేట రెండు జిల్లాలు అయితే రెండు కలిసే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులే రాష్ట్రంలో ఉంటాయి.  

రాయలసీమ అస్తిత్వానికి ప్రమాదం  ప్రజల మనోభావాలకు విఘాతం….
జిల్లాల ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం  చారిత్రక నేపథ్యం , ప్రజల మనోభావాలు. రాష్ట్రం రాయలసీమ , కోస్తా , ఉత్తరాంధ్ర గా ఉన్నది. జిల్లాల సరిహద్దులు కూడా భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీయకుండా ఉన్నది. 25 జిల్లాల ఏర్పాటు కూడా అందుకు భిన్నంగా ఉండకూడదు. ప్రస్తుతం రాయలసీమ కడప , కర్నూలు , అనంతపురం , చిత్తూరు జిల్లాలుగా ఉన్నది. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేస్తే రాయలసీమలోని కీలకమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల రాయలసీమ భౌగోళిక ప్రాంతం నుంచి దూరం చేస్తుంది. ఎందుకంటే తిరుపతి నియోజకవర్గంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉంటే నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆలా తిరుపతి జిల్లాను రాయలసీమ చిత్రపటం నుంచి తప్పించినట్లు అవుతుంది. అంతే కాదు తిరుపతి , తిరుచానూరు చంద్రగిరి , తిరుమల శ్రీవారి ఆలయం పరిధిలో ఉంటుంది. తిరుపతి జిల్లాలో తిరుమల , తిరుపతి ఉంటే చిత్తూరు జిల్లాలో తిరుచానూరు , శ్రీనివాస్ మంగాపురం ఉంటుంది. తిరుమలకు వెళ్లే రెండు నడక దారులు రెండు జిల్లాలలో ఉంటుంది. తిరుమలతో విడదీయరాని అనుబంధం కలిగిన చంద్రగిరిని తిరుపతి జిల్లాతో అనుబంధాన్ని తొలగించడం మంచిది కాదు. ఇలాంటి భావోద్వేగాలతో కూడిన అంశాలు వివిధ జిల్లాల్లో ఉంటాయి.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే కీలక నిర్ణయం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే వైపు అడుగులు వేయడం ఆహ్వానించదగిన నిర్ణయం. తుది నిర్ణయం తీసుకునే ముందు పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన కాకుండా చారిత్రక నేపథ్యం , ప్రజల మనోభావాలు , భావోద్వేగాలతో కూడిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలి. అందుకు గాను కమిషన్ వేసి విస్తృత ప్రజాభిప్రయాన్ని తీసుకోవాలి 25 జిల్లాలుగా జరగబోయే ఏర్పాటు 10 కాలాలుపాటు ప్రజల మన్ననలు పొందాలి.

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం