ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై బిగ్ బ్రేకింగ్… వైసీపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాలను ఎట్టకేలకు వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టు సాక్షిగా ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూల్‌లో జ్యుడిషియల్, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయపోరాటం సాగిస్తున్నారు. మరోవైపు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో మహాపాదయాత్ర చేపట్టారు.
మరోవైపు మూడు రాజధానులపై హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. ఈ దశలో ఇవాళ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానుల చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్ జనరల్ సోమవారం తెలిపారు.
సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయం గురించి ప్రకటన చేయనున్నారు.