అబ్బా…అంత మందికి సాయ‌మా?

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అందిస్తున్న సాయం గురించి తెలుసుకుంటే ఎవ‌రైనా ….అబ్బా అంత మందికా అని ఆశ్చ‌ర్య‌పోతారు. బాబుది ఎంత పే…ద్ద మ‌న‌సో అని అనకుండా, అనుకోకుండా ఉండలేరు.  Advertisement సుదీర్ఘ…

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అందిస్తున్న సాయం గురించి తెలుసుకుంటే ఎవ‌రైనా ….అబ్బా అంత మందికా అని ఆశ్చ‌ర్య‌పోతారు. బాబుది ఎంత పే…ద్ద మ‌న‌సో అని అనకుండా, అనుకోకుండా ఉండలేరు. 

సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించే అధికారం క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌ల రుణాన్ని తీర్చుకుంటున్న విధానం చూస్తే … ఏమంటారో మీరే నిర్ణ‌యించుకోండి. బాబు గారి స‌హృద‌య‌త ముందు దేశ‌మంతా జ‌య‌జ‌య ధ్వానాలు పలుకుతున్న సోనూసూద్ ఎంత‌? …అని అంటారా లేక మ‌రేమాటైనా? అనాల‌నిపిస్తుందా?

క‌రోనా విప‌త్కాలంలో రోగుల‌కు కేవ‌లం ప్ర‌భుత్వాలు అందిస్తున్న సాయం స‌రిపోవ‌డం లేదు. ఎందుకంటే క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి అనూహ్యంగా అంత‌కంత‌కూ పెర‌గ‌డంతో రోగులు అంచ‌నాల‌కు మించి వ‌స్తున్నారు. దీంతో వారంద‌రికీ ఆస్ప‌త్రుల్లో బెడ్స్‌, ఆక్సిజ‌న్ సౌక‌ర్యం అందించ‌డం ప్ర‌భుత్వాల‌కు క‌ష్ట‌మ‌వుతోంది. 

ఈ నేప‌థ్యంలో మ‌న‌సున్న మారాజులు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి త‌మ శ‌క్తికి మించి సాయం అందిస్తున్నారు. ఎవ‌రికి తోచిన రీతిలో వారు త‌మ వంతు సేవ‌లు అందిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కొంద‌రు అనాథ శ‌వాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు.

క‌రోనాతో మృతి చెంద‌డంతో , వాటిని తీసుకెళితే తాము కూడా క‌రోనా బారిన ప‌డ‌తామ‌నే ఆందోళ‌న చెందేవాళ్లే ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో శ‌వాల‌ను ఆస్ప‌త్రుల్లోనే కుటుంబ స‌భ్యులు వ‌దిలేస్తున్నారు. అలాంటి మృత‌దేహాల‌కు కొంద‌రు స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌ల ప్ర‌తినిధులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తుండ‌డం గొప్ప సేవ‌గా చెప్పొచ్చు. 

మ‌రికొంద‌రు నేత‌లు ఉచితంగా కోవిడ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి బెడ్స్‌, ఆక్సిజ‌న్‌ను అందిస్తూ ప్రాణాల‌ను కాపాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు తాను చేయాల‌నుకుంటున్న సేవ‌ల గురించి చెప్పారు.

‘కరోనా సవాళ్లు-నివారణ చర్యలు’ అన్న అంశంపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్య నిపుణులతో జరిగిన వెబినార్‌లో చంద్రబాబు మాట్లాడారు. కనీసం 10 వేల మంది కొవిడ్‌ రోగులకైనా తెదేపా, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా టెలీమెడిసిన్‌ విధానంలో సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబునాయడు తెలిపారు.  

ఇప్పటికే మోడల్‌ ప్రాజెక్టులో భాగంగా హోం ఐసొలే షన్‌లో ఉన్నవారికి వైద్య సలహాలు, మందులు అందిస్తున్న‌ట్టు బాబు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న పేదలకు రోజుకు మూడు సార్లు ఆహారం పంపిస్తున్నామ‌ని, కొందరికి ఆక్సిజన్‌ సిలిండర్లూ సమకూర్చామ‌న్నారు.

చివ‌రిగా అస‌లు విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. అదేంటంటే ‘మిలాప్‌’ యాప్‌ ద్వారా నిధులు సమీకరిస్తున్న‌ట్టు చంద్రబాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం. సొమ్ము ఒక‌రిది…సోకు మ‌రొక‌రిది అన్న‌ట్టుగా చంద్ర‌బాబు క‌రోనా సేవ ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఊరోళ్ల సొమ్మ‌తో బాబు సేవా సోకులేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

క‌నీసం ఇలాంటి స‌మ‌యంలో కూడా జేబులో నుంచి ప‌ది రూపాయ‌లు తీసి ఖ‌ర్చు చేయ‌డానికి మ‌న‌సు రాలేదా? అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర లేంది మ‌నీనా? మ‌న‌సా? అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

పైగా నిధులు స‌మీకరిస్తూ ….కేవ‌లం 10 వేల మందికి సేవ‌లందించాల‌ని టార్గెట్ పెట్టుకోవ‌డంపై మండిప‌డుతున్నారు. క‌నీసం ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 60 మందికి కూడా సాయం అందించే స్తోమ‌త టీడీపీకి, చంద్ర‌బాబుకు లేవా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. చేసేది గోరంత‌, చెప్పుకునేది మాత్రం కొండంత అన్న రీతిలో చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకోవ‌డంపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.