తెలుగుదేశం పార్టీ నాయకులు బొత్తిగా రొటీన్ డైలాగులే పేల్చుతున్నారు. అయితే వాటికి చప్పుడు అంతగా లేదని గ్రహించలేకపోతున్నారు. ఎంతసేపూ అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడమే అలవాటుగా మార్చుకుంటున్నారు.
కక్ష సాధింపు చర్యలకు వైసీపీ సర్కార్ పాల్పడుతోందని కొన్ని వందల వేల సార్లు తెలుగుదేశం నాయకులు ఇప్పటికి అని ఉంటారు. విని వినీ జనాలకే అవి బోర్ కొడుతున్నాయి కానీ తమ్ముళ్ళు మాత్రం ఎక్కడా ఆపడంలేదు.
తాజాగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా అవే రోటీన్ డైలాగులు వదిలారు. అరాచక పాలన రౌడీ పాలన ఏపీలో సాగుతోంది అంటూ గట్టిగానే సౌండ్ చేశారు. సరే ఇప్పటికి రెండేళ్ళుగా ఇవే డైలాగులు వల్లె వేస్తున్నారు కదా.
మరి జనాల్లో వీటి మీద ప్రభావం ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తమ్ముళ్లకు అర్ధమవుతోందా అన్నదే ప్రశ్న. అంతే కాదు వచ్చేది మా సర్కార్. ఇంతకు ఇంత వడ్డీలు చెల్లిస్తామని చెప్పడం పట్ల కూడా జనాల్లో రియాక్షన్ పెద్దగా లేకుండా పోతోంది. అంటే ప్రజల సమస్యలు, అభివృద్ధి అన్నవి అసలు అజెండా కానే కాదని తమ్ముళ్ళే చెప్పేసుకుంటున్నారా అన్నదే డౌట్ మరి.