అకటా….ప్రతిపక్షం డిమాండుకు తలొగ్గడమా..? 

ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు … అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడమంటూ జరగదు. ఇక్కడ కలిసి పని చేయడమంటే…

ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు … అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడమంటూ జరగదు. ఇక్కడ కలిసి పని చేయడమంటే కలిసి చర్చించడం అన్నమాట. అఖిల పక్ష సమావేశాల్లాంటివి నిర్వహించడమన్న మాట. ఏదైనా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి. అది డిమాండుగానే ఉంటుంది తప్ప ఆ పని ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. 

ప్రతిపక్షాలు గొడవ చేయడం కాదు, తమకు నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం అడుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రతిపక్షాలు మంచి సలహాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అందరిదీ ఒకే ధోరణి. ఇందుకు కారణం ఇగో ప్రాబ్లమ్ ఒకటైతే, ప్రతిపక్షాల సూచనలు పాటిస్తే ఆ క్రెడిట్ వాటికి దక్కుతుందని, అవి తమ గొప్పతనాన్ని ప్రచారం చేసుకుంటాయని ప్రభుత్వం భయం. అందుకే సమస్యలకు ప్రతిపక్షాలు పరిష్కారాలు చూపించిన ప్రభుత్వాలు పెడచెవిన పెడతాయి. 

తమ నిర్ణయాలను సమర్ధించుకోవడానికి నానా తిప్పలు పడతాయి. ఇంత ఉపోద్ఘాతం దేనికంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందు ఓ క్లిష్ట సమస్య ఉంది. దానిపై ఏం నిర్ణయం తీసుకోవాలో జగన్ ప్రభుత్వానికి అర్ధం కావడంలేదు. అదే పదో తరగతి, ఇతర పరీక్షల రద్దుకు సంబంధించింది. తెలంగాణలో టెన్త్ పరీక్షలు, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దయ్యాయి. రేపటి నుంచి స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు కూడా ప్రభుత్వం ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం అనుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేవి. కానీ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి పరీక్షలు రద్దయిపోయాయి. కానీ ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతిపక్షాలు కొవిడ్ ఇంత తీవ్ర్రంగా ఉన్నప్పుడు పరీక్షలు వద్దని చెబుతున్నాయి. 

ఏపీ ప్రభుత్వంపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రజల నుంచి మద్దతు భారీగా లభిస్తోంది.. జిల్లాల వారీగా ఇప్పటికే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు టీడీపీ యువనేతలు. దీంతో ఎక్కువంది లోకేష్ ప్రతిపాదనే సరైందని అంటున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ప్రజల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎక్కుమంది ట్వీట్ లు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు పెట్టి తీరుతామంటోంది. ఇలాంటి ఘర్షణ వచ్చినప్పుడేకదా ప్రభుత్వం, ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటపడతాయి. ఇప్పుడు ఏపీలో  ఇదే జరుగుతోంది. 

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తారా? చేయరా అన్నది ఇప్పటి ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రభుత్వం ఓవైపు స్పష్టంగా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని పదే పదే చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు ప్రతికూలంగా కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటున్నారు సీఎం జగన్.  

భవిష్యత్తులో ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా. మంచి ఉద్యోగం సాధించినా పది, ఇంటర్ పరీక్షల మార్కులే ముఖ్యమైనవిగా పరిగణలోకి తీసుకుంటారని? అందుకే ఆ పరీక్షలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. రోజు రోజుకూ విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఇటు రాత్రి పూట కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కేసులు రెట్టింపు అవుతన్నాయి తప్ప పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు సైతం చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ఇక సచివాల ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం సచివాలయం అనే కాదు దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కరోనా వెంటాడుతోంది.  ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఇంటి నుంచి పని చేస్తామని అడుగుతున్నారు. 

వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహణ కత్తిమీద సామే అని చెప్పాలి. అయితే దీనిపై ఈ నెల 27 లేదా 29 తేదీల్లో సీఎం జగన్ ఫైనల్ డిసెషన్ తీసుకుంటారనే ప్రచారం ఉంది. అయితే ఒక వేళ పరీక్షలను రద్దు చేస్తే.. లోకేష్ డిమాండ్ కు తల ఊపినట్టు ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశగా మారినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే గత కొంతకాలంగా లోకేష్ వినిపిస్తున్న డిమాండ్ అదే. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడొద్దని, కోరనా ఇంతలా విరుచుకుపడుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించడం మంచింది కాదని.. ఇదే విషయం సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు లోకేష్. అయినా ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు మొండిగా ముందుకే వెళ్తోంది. దీంతో ఈ డిమాండ్ ను నేరుగా ప్రజల ముందే పెట్టాడు నారా లోకేష్. ఆయనకు మద్దతుగా అన్ని జిల్లాల్లో యువ నేతలు నేరుగా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

ఆన్ లైన్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారుకూడా. అయితే అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పరీక్షలు రద్దు చేయాలనే కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ పరీక్షల కోసం వెళితే కరోనా సోకితే పరిస్థితి ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు ఎక్కువమంది చెప్పారు. మరి ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి..

నిజానికి ప్రభుత్వం కూడా పరీక్షలను రద్దు చేయాలనే ఆలోచనలోనే ఉందని.. కానీ లోకేష్ డిమాండ్ ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు రద్దు చేస్తే.. ఆయన డిమాండ్ కారణంగా రద్దు చేశారన్న ప్రచారాన్ని టీడీపీ చేసుకుంటుందని వెనుకడుగు వేసినట్టు వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. 29న విద్యా శాఖపై సమీక్ష చేసి.. కేబినెట్ భేటీలో పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. 

ఈ లోపు హైకోర్టులో పిటిషన్ వేయాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. కోర్టుతో చీవాట్లు పెట్టించుకునే పరిస్థితి తెప్పించుకోవడం కంటే.. ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా పరీక్షలను రద్దు చేస్తే బెటరని కొందరు నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.