అమరావతి కధ విశాఖలో జరిగేనా?

అమరావతిలో రాజధాని రైతుల ఆందోళన రెండు వందల రోజులు అంటూ పోస్టర్లు బాగానే గుద్దారు. సోషల్ మీడియాలో ఒక్క లెక్కన హల్ చల్ చేశారు. నిజానికి ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి కానీ…

అమరావతిలో రాజధాని రైతుల ఆందోళన రెండు వందల రోజులు అంటూ పోస్టర్లు బాగానే గుద్దారు. సోషల్ మీడియాలో ఒక్క లెక్కన హల్ చల్ చేశారు. నిజానికి ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి కానీ దేనికీ ఇంత హైప్ లేదు, ఆ మాటకు వస్తే జనాల్లో ఉండే ఉద్యమాలకు ప్రచారాలు అర్భాటాలూ ఏవీ  అసలు అవసరం లేదు కూడా

సరే అమరావతి కావాలన్నది కొందరి వాదన, ఇక వైసీపీ సర్కార్ విశాఖను పాలనారాజధాని చేయాలనుకుంటోంది. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల సమగ్ర అభివ్రుధ్ధే తమ సంకల్పమని వైసీపీ నేతలు ఒకటికి పదిసార్లు గట్టిగానే  చెబుతున్నారు.

విశాఖ  అభువ్రుధ్ధి కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లుగా కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖను రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరని, చంద్రబాబు ఎన్ని రకాల జిత్తులు  వేసినా  అది సాధ్యమయ్యేది కానేకాదని కూడా ఆయన కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అగ్రగామిగా, నంబర్ వన్ సిటీగా విశాఖను అభివ్రుధ్ధి చేస్తామని, విశాఖను రాజధాని చేసి అందరూ ఇటు వైపు చూసేలా తీర్చిదిద్దుతామని  ఆయన అంటున్నారు.

దీనికోసం ప్రభుత్వ సంకల్పంతో పాటు ప్రజలు కూడా అండగా నిలవాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. విశాఖ జనం ముందుకొచ్చి విశాఖ రాజధాని కోరాలన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉంది. అలాగే విపక్ష తెలుగుదేశం చేస్తున్న  కుట్రలను అర్ధం చేసుకుని జనమే  నగర ప్రగతికి కాపాడుకోవాలన్నది  కూడా ఆయన ఆలోచన.

కానీ విశాఖ జనం అలా చైతన్యవంతులై ముందుకు వస్తారా. విశాఖ రాజధానిగా ప్రకటించిన రోజు నుంచి ఈనాటి వరకూ వద్దు అన్న రాజకీయమే జోరుగా సాగుతున్నా నగర జనం మౌన ప్రేక్షకులుగానే చూస్తున్నారు తప్ప మాట సాయమేదీ లేని వేళ ఇపుడు అండగా నిలిచి అమరావతి ఉద్యమానికి ధీటుగా, పోటీగా  విపక్ష రాక్షస రాజకీయాన్ని అడ్డుకుంటారా. ఏమో చెప్పలేం. ఎందుకంటే విశాఖ అంటేనే ప్రశాంతత. విశాఖ అంటేనే శాంతిదూత. ఆ పేరు అలాగే నిలబెట్టే జనమే ఇక్కడ లక్షల్లో ఉన్నారు మరి.

టీటీడీలో 140 మందికి పాజిటివ్

బాలినేని మీద బురద చల్లొద్దు