సీఐడీ కస్టీడీలో బాబు.. మళ్లీ తెరపైకి అదే ‘సెంటిమెంట్’

చంద్రబాబుకు 23తో ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ నెగెటివ్ సెంటిమెంట్ మరింత విస్తరించింది. తనకుతాను నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బాబు, 2023లో అరెస్ట్ అయ్యాడు. ఆ వెంటనే…

చంద్రబాబుకు 23తో ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ నెగెటివ్ సెంటిమెంట్ మరింత విస్తరించింది. తనకుతాను నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బాబు, 2023లో అరెస్ట్ అయ్యాడు. ఆ వెంటనే సీఐడీ కస్టడీలోకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. తన జీవితంలో ఏదైతే జరగకూడదని చంద్రబాబు, ఇన్నాళ్లూ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడో, ఇప్పుడు అదే జరిగింది. యాదృచ్ఛికంగా ఇది 2023 సంవత్సరం. గమనిస్తే, ఈ ఏడాదిలో '23' అనే నంబర్ ఉంది.

చంద్రబాబుకు కేసులు కొత్త కాదు. ఆయనపై ఇప్పటికే పలు కేసులున్నాయి. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు వ్యవస్థల్ని ఆయన మేనేజ్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు. అందుకే ఇన్నాళ్లూ ఆయన బెయిల్స్ తో నెట్టుకుంటూ వచ్చారు. తెరవెనక బాబు లాబీయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందంటే, చాలామందికి ఆయనపై కేసులు కూడా ఉన్నాయనే విషయం తెలియదు. ఈ విషయంలో క్రెడిట్ అంతా రామోజీరావుకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలా దశాబ్దాలుగా మేనేజ్ చేస్తూ వస్తున్న చంద్రబాబుకు కాలం కలిసిరాలేదు. 23 అనే నెగెటివ్ నంబర్ ఆయన మెడకు చాలా బలంగా చుట్టుకుంది. ఎంతలా అంటే జగన్ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ, 2023 అనే సంవత్సరంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. జీవితంలో తొలిసారి జైలు జీవితం గడుపుతున్నారు. సీఐడీ కస్టడీలోకి కూడా వెళ్లాల్సి వచ్చింది.

ఆయన నిజంగా స్కిల్ స్కామ్ చేశారా లేదా.. ఈ కేసులో ఆయన ప్రమేయం ఎంత ఉందనేది విచారణ సంస్థలు, కోర్టు తేలుస్తాయి. కానీ 23 అనే నంబర్ చంద్రబాబును ఎంత బలంగా చుట్టుకుందనేదానికి ఉదాహరణ తాజా అరెస్ట్, సీఐడీ కస్టడీ.

గతంలో బాబును ఇబ్బంది పెట్టిన '23' ఘటనలు ఇవే..!

– 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చిన సీట్లు 23

– ఫలితాలు వెలువడింది కూడా 2019 మే 23వ తేదీనే.

– తన హయాంలో వైసీపీ నుంచి చంద్రబాబు లాగేసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 23

– నారా లోకేష్ పుట్టిన తేదీ 23 (ఈమధ్య ఇది కూడా ట్రోలింగ్ పాయింట్ అయింది)

– జెట్పీసీటీ ఎన్నికల్లో కుప్పం మండలంలో చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ అభ్యర్థి వయసు 23.

– చంద్రబాబు అరెస్ట్‌ అయిన తేదీ 9-9-23. ఈ మొత్తం అంకెలను కూడితే 23 వస్తుంది.

– చంద్రబాబు అరెస్ట్ అయిన సంవత్సరం 2023లో కూడా 23 ఉంది.

– రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబర్‌ కేటాయించారు. వీటన్నింటిని కలిపితే వచ్చే నంబర్ 23.

– చంద్రబాబును జ్యుడిషియల్ కస్టడీ గడువు తేదీ కూడా 23.