తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీ అభిమాన సామాజిక వర్గ జనాలు ఇప్పుడు ఒకటే మాట చెబుతుంటారు. ఈసారి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైకాపా పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ప్రైవేట్ డిస్కషన్లలో కూడా ఢంకా భజాయిస్తుంటారు.
అసలు తెలుగుదేశం స్ట్రాటజీ కూడా అదే. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తాము ఫుల్ స్వీప్ చేస్తే, తమ మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈస్ట్, వెస్ట్ ల్లో. ఫుల్ స్వీప్ చేసేస్తారు. అందువల్ల 13 జిల్లాలకు నాలుగు జిల్లాల్లో వైకాపాకు డిపాజిట్లు రావు అన్నది వారి ధీమా. ప్రైవేట్ డిస్కషన్లలో తెలుగుదేశం సామాజిక అభిమానులు తరచు చెప్పేది ఇదే.
కానీ గమ్మత్తేమిటంటే అదే కృష్ణ జిల్లా కేంద్రం విజయవాడలో వైకాపా జనాలు చెలరేగిపోయారంటున్నారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ సందర్భంగా విజయవాడలోని ఓ థియేటర్ లో నానా గత్తర జరిగిపోయింది. స్క్రీన్ చించేసారు. కుర్చీలు విరిచేసారు. నిజానికి ఈ మధ్య ఇదో ట్రెండ్ అయిపోయింది. రీరిలీజ్ స్పెషల్ షోలు అంటే చాలు థియేటర్ యజమానులు భయపడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.
ఈస్ట్ గోదావరిలో అయితే ఇలాంటి షో లకు థియేటర్ల ఇవ్వకూడదని తీర్మానాలు చేసిన సందర్భాలు వున్నాయి. వాస్తవం ఇదైతే, విజయవాడ సంఘటన వైకాపా జనాల పని అంటూ తెలుగుదేశం పార్టీ, దాని సోషల్ మీడియా హడావుడి చేయడం మొదలు పెట్టింది.
పవన్ ఫ్యాన్స్ ముసుగులో వైకాపా జనాలు ఈపని చేసారు అంటోంది. నిజానికి ఈ మాట అనాల్సింది పవన్ ఫ్యాన్స్ లేదా జనసేన పార్టీ. కానీ వారి తరపును తేదేపా వకాల్తా తీసుకుని వైకాపా మీద బురదేయడం మొదలుపెట్టింది.
ఒక పక్క కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైకాపా తుడిచి పెట్టుకుపోతుందని అంటూనే, వైకాపా జనాలు థియేటర్ మీద పడ్డారని అనడం చిత్రంగా వుంది. గత ఆరేడు నెలల్లో చాలా థియేటర్లలో ఇలాంటి దారుణాలు జరిగాయి. మరి అవి జరిగనపుడల్లా ఎవరూ రాజకీయం చేయలేదు.
ఏ స్టార్ అభిమానులు ఆ స్టార్ సినిమాకు ఇలాగే చేసారు. అప్పుడేమీ మాట్లాడలేదు. కానీ ఇదే పవన్ సినిమాకు జరిగేసరికి వైకాపా చేస్తోంది అంటూ యాగీ మొదలు పెట్టారు. ఇదే కదా రాజకీయం అంటే.