గాజువాక నుంచి పవన్….?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దాని మీద జనసైనికులలో చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి పాలు…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దాని మీద జనసైనికులలో చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి పాలు అయ్యారు. ఈసారి పోటీ చేస్తే గెలిపించుకుంటామని జనసైనికులు అంటున్నారు.

పవన్ గాజువాక మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని అంటున్నారు. ఆయన గత నాలుగేళ్లలో రెండు సార్లు మాత్రమే గాజువాకకు వచ్చారు. తాజాగా మారిన రాజకీయ పరిణామాలను చూసిన వారు అంతా ఆయన భీమవరం నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. గోదావరి జిల్లాల మీద జనసేన ఎక్కువ దృష్టి పెట్టిందని అంటున్నారు.

గాజువాక సీటుని జనసేన పొత్తులో కొరుకుంటోందని, ఆ సీటుని బీసీలకు ఇవ్వడం ద్వారా కాపు ప్లస్ బీసీ కార్డుతో గెలుపు బాటలు వేసుకోవాలని చూస్తోంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయాలని ఈసారి కూడా రెండు సీట్లలో పోటీ చేయాలని పార్టీ వారి నుంచి అయితే అభ్యర్ధన వస్తోంది.

గాజువాక విషయం తీసుకుంటే పవన్ కాకున్నా జనసేనకే టికెట్ పొత్తులో భాగంగా ఆ సీటును కోరుతారు అని అంటున్నారు. దీంతో తెలుగుదేశం తమ్ముళ్లలో టెన్షన్ పెరుగుతోంది. గాజువాక నుంచి సీనియర్ నేత పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తులో గాజువాక సీటూ తన ఫేటూ ఎలా ఉందో అన్న ఆందోళన అయితే తమ్ముళ్ళలో ఉందిట.