గత వారం రోజులుగా రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చలోకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంటర్ అయ్యారు. డైరెక్ట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్టర్ వేదికగా.. “స్వాతి చౌదరి” కి “రెడ్డి” పేరు పెట్టి నీచ యుద్ధం చేసే బదులు.. మీకో, మీ కొడుకు పేరుకే రెడ్డి తగిలించుకోవచ్చుకదా బాబూ..?.. అబద్ధాలకు మారు పేరైన బాబు.. ఇప్పుడు అశ్లీల రాజకీయానికి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇక మీదట, ఈయన పేరు “కోట స్వాతిముత్యం చౌదరి” అంటూ ట్వీట్ చేశారు.
కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుండి లోకేష్, బాబుపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి కొన్ని రోజుల పాటు తన భాషను గణనీయంగా తగ్గించారు. ఎక్కువగా అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున, సాయి రెడ్డి తన పాత స్టైల్‌కు వచ్చి చంద్రబాబు, లోకేష్‌లపై పదునైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం స్టార్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
కాగా సోషల్ మీడియాలో ఈ రచ్చకు ప్రధాన కారణం.. విదేశాల్లో వుంటూ నిత్యం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెడుతూ శునకానందం పొందుతున్న స్వాతి చౌదరి (ట్వీట్టర్‌లో స్వాతి రెడ్డి) చేస్తున్న ఓవరాక్షన్‌ను అరికట్టే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఆమె బాగోతాలన్ని బట్టబయలు చేయడంతో వివాదం చేలరేగింది. ఆ యువతికి చంద్రబాబు ఫోన్ చేసి మరి వత్తాసు పలకడంతో వివాదం మరింత ముదిరింది.
ఇప్పటికే లోకేష్‌పై వైసీపీ నేతలు అంటున్న మాటలకు.. తాజా విజయసాయి రెడ్డి ట్వీట్ తోడవడంతో వివాదం మరింత ముదిరింది. కొందరు సోషల్ మీడియాలో చేసే ఓవరాక్షన్‌కు మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రియాక్ట్ అవ్వడం.. దానికి ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వడం విశేషం.